‘రేసుగుర్రం’ చిత్రంతో తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నారు స్టార్ నటుడు రవికిషన్. ఇప్పుడు యాక్టింగ్‌తో పాటు పాలిటిక్స్తోనూ ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి ప్రముఖ వ్యక్తి కూతురు భారత ఆర్మీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆర్మీలో చేరాలనేది చాలా మంది యువత కల. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. పుట్టిన గడ్డ కోసం ప్రాణాలు వదిలేందుకు సిద్ధంగా ఉండే జవాన్లను మించిన యోధులు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకే వారిని చాలా మంది యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకొని.. వారి బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తారు. అయితే భద్రతా బలగాల్లో సామాన్యులు చేరాలనుకోవడం, అటు వైపు కెరీర్‌ను మల్చుకోవడం మామూలే. కానీ సెలబ్రిటీల పిల్లలు ఇటు వైపు రావడం మాత్రం తక్కువే. ఇప్పుడో సెలబ్రిటీ కూతురు మిగతా వారి కంటే తాను భిన్నమని నిరూపించారు. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా. సైన్యంలో చేరాలనే తన కోరికను ఆమె నెరవేర్చుకున్నారు. త్రివిధ దళాల్లో జవాన్ల నియామకాల కోసం కేంద్ర సర్కారు ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ కింద.. ఇషిత అగ్నివీర్‌గా మారారు.
కూతురు ఇషితా శుక్లా సైన్యంలో చేరిన విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన ‘7 గర్ల్ బెటాలియన్’లో ఇషిత సభ్యురాలని ఆయన తెలిపారు. ఇక, ప్రస్తుతం ఆమె వయసు 21 సంవత్సరాలు కావడం గమనార్హం. దేశ సేవ కోసం ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్న ఇషితాపై నెట్టింట ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సైన్యంలో చేరాలనే డెసిజన్ గ్రేట్ అని ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, భోజ్‌పురి మూవీ ఇండస్ట్రీకి చెందిన రవికిషన్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ పాత్రలో తనదైన యాక్టింగ్‌తో రవికిషన్ అందర్నీ మెప్పించారు. గతేడాది ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్‌తో మరోమారు తన సత్తా చాటారాయన. రవికిషన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా రవికిషన్ గెలిచారు.
Ravi Kishan’s 21-year-old daughter Ishita Shukla to join Indian Armed Forces.
She also participated in the Republic Day Parade of 2023 along with 147 other women as a part of the National Cadet Corps (NCC). pic.twitter.com/5aNr0LiRxR
— Anshul Saxena (@AskAnshul) June 28, 2023