టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా హాట్ క్లీవేజ్ షోతో కాకరేపుతున్నారు. యువత మతులు పోగొట్టేలా ఆమె తాజాగా కెమెరాల ముందు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
రాశి ఖన్నా.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ కలిగిన నటి. యంగ్ హీరో నాగశౌర్య సరసన చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారామె. ఫస్ట్ ఫిల్మ్‌తోనే నటిగా తానేంటో ఆమె ప్రూవ్ చేసుకున్నారు. మెస్మరైజింగ్ అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. అందుకే ఆ తర్వాత రాశీని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘సుప్రీం’, ‘జై లవకుశ’, ‘మనం’, ‘వెంకీ మామ’, ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజు పండగే’ మూవీస్‌తో మంచి హిట్లు అందుకున్నారు రాశి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సరసన నటించిన ‘సర్దార్’ సినిమాతో గతేడాది మరో హిట్‌ను తన అకౌంట్లో వేసుకున్నారు రాశి ఖన్నా. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉన్నప్పటికీ ఆమెకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈమధ్య ఆమె బాగా సన్నబడ్డారు. అయినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు రాశి ఖన్నా క్రేజ్ మరింత పెరిగిందే కానీ.. ఇసుమంత కూడా తగ్గలేదు.
ప్రస్తుతం బాలీవుడ్‌పై రాశి ఖన్నా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో షాహిద్ కపూర్ పక్కన ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించి ఆకట్టుకున్నారామె. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే.. తన అందంతో యువతకు ఎప్పుడూ గిలిగింతలు పెట్టే రాశి ఖన్నా.. మరోమారు కళ్లు చెదిరే గ్లామర్‌తో కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. బ్లాక్ డ్రెస్‌లో నల్ల త్రాచులా ఆమె దిగిన ఫొటోలు కెవ్వుకేక అనేలా ఉన్నాయి. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్ ఫంక్షన్లో రాశి ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయారు. ఈ ఫొటోల్లో ఆమె కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. ఎద అందాలు కనిపించేలా రాశి దిగిన ఫొటోలు యువత మతులు పోగొడుతున్నాయి. రాశి నుంచి ఈ రేంజ్లో అందాల ఆరబోత ఊహించలేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Uff.. Rashi Khanna’s stunning back look from the event is too pretty 😍 Don’t you agree? 😉#RashiKhanna #TamilCinema #Cineglitzz pic.twitter.com/YVnqoYldJ4
— Cineglitzz (@cineglitzz_offl) June 19, 2023
Actress Raashi Khanna Stills in Stunning Black Dress🔥🔥#rashikhanna #tollywoodactress #tupaki #latestphotoshoot #viralpics #stunninglook #blackdress @tupakinews_ pic.twitter.com/CUxxwkFJjG
— Tupaki (@tupakinews_) June 19, 2023