సినీ ఇండస్ట్రీలో చాలా మంది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అభిప్రాయ భేదాలతో తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2018లో కోంకణి, సింధూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఓ ఈవెంట్ లో ముద్దులతో స్టేజ్ పై హల్ చల్ చేశారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
బాలీవుడ్ లో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ జంటగా పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ జంట ‘సర్కస్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కరెంట్ లగారే అనే పాట ముంబాయిలో రిలీజ్ చేశారు. స్టేజ్ పై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ పాటలో నేను కూడా ఉన్నా.. నా జీవిత మహరాణి.. ఎంటర్ టైన్ మెంట్ క్వీన్ అంటూ స్టేజ్ పైకి రా’ అంటూ దీపికా పదుకొనే ని పిలిచాడు. స్టేజ్ పైకి వచ్చిన దీపికా పదుకొనే ఆనందాన్ని ఆపుకోలేక రణ్‌వీర్ సింగ్ కి లైవ్ లో ముద్దు పెట్టేసింది.
ఈ మూవీలోని పాటకు ఇద్దరూ కలిసి స్టేప్పులు వేస్తూ అందరినీ అలరించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ‘సర్కస్’ మూవీలో పూజా హెగ్డే, వరుణ్ శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరికొంతమంది భారీ తారాగణం నటిస్తున్నారు. ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకును అలరించబోతున్నటలు చిత్ర యూనిట్ తెలిపారు. డిసెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ముద్దు సీన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.