బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘యానిమల్‘. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 22న కులుమనాలిలో ప్రారంభమైంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ ని రూపొందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు మొదట్లోనే లీకుల బెడద
స్టార్ట్ అయ్యింది.
మొదటి రోజు షూటింగ్ కు సంబంధించి రణబీర్ – రష్మికల ట్రెడిషనల్ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. రణబీర్ – రష్మిక ఇద్దరూ కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తున్నారు. రణబీర్ వైట్ కుర్తా, పైజామా ధరించగా.. రష్మిక చీరలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రణబీర్ – రష్మిక కొత్త లుక్ చూసి అందరూ ఇష్టపడుతున్నారు. మరి రణబీర్ – రష్మిక జోడీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.