మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతోంది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే ఎక్కువగా మోస పోతాము. దీనికి ఎవ్వరు అతీతులు కారు. ఇదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన మేనేజర్ చేతిలో మోసపోయింది. ఆ వివరాలు...
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రష్మిక మందన్న. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెల్తుంది. మైమరిపించే అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. కోలీవుడ్ లో కిరిక్ పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరవాత సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటూ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. కిరిక్ పార్టీ మూవీలో నటుడు రక్షిత్ శెట్టి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరవాత నిశ్చితార్థం కూడా జరుపుకున్న వీరు వ్యక్తిగత కారణాలతో వారి రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకున్నారు.
రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తరువాత గీత గోవిందం సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ ల సినిమాల్లో నటించిన రష్మిక ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగు లేని నాయికగా ఎదిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో ఆకట్టుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. యూత్ కి క్రష్ గా మారిపోయింది.
ఇదిలా ఉంటే రష్మిక మందన్న సినీ కెరీర్ ఆరంభం నుంచి తనకు మేనేజర్ గా వ్యవహరించిన వ్యక్తి మోసం చేసినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 80 లక్షలు రష్మికకు తెలయకుండా కాజేసినట్లు తెలుస్తోంది. దీంతో మేనేజర్ ను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు రష్మిక మందన్న స్పందించలేదు. మరి ఈ విషయంలో నిజం ఏంటో తెలియాలంటే రష్మిక మందన్న స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా రష్మిక నటిస్తోన్న పుష్ప 2, హిందీలో యానిమల్ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.