సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆరాటపడుతుంటారు. ఎక్కడైనా సరే సెలబ్రిటీలు కనిపిస్తే దగ్గరికి వెళ్లి.. వారితో సెల్ఫీ లేదా ఒక నార్మల్ ఫోటో దిగి సంతోషపడుతుంటారు. ఫ్యాన్స్, ఆడియెన్స్ అలా ఫోటోలు దిగాలని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే.. ఎప్పుడూ తెరపై, టీవీలలో కనిపించే సెలబ్రిటీలు ఏకంగా ఎదురైతే.. వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు దొరకరు కదా! కానీ.. కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీలు ఫోటో కోసం ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తే.. వింతగా బిహేవ్ చేస్తుంటారు. ఫోటో కోసమ్ దగ్గరికి వస్తే.. మీద పడ్డట్లుగా వార్నింగులు ఇచ్చేస్తుంటారు.
తాజాగా బాలీవుడ్ సె*క్స్ బాంబుగా పేరు తెచ్చుకున్న నటి.. ఓ అభిమాని ఫోటో కోసం దగ్గరికి వస్తే వెరైటీగా బిహేవ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా? ఆవిడే రాఖీ సావంత్. ఈ బోల్డ్ బ్యూటీ గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో నటిగా రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న రాఖీ.. నటిగా కంటే ఐటమ్ హీరోయిన్ గా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ లో దాదాపు 25కి పైగా ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. అంతేగాక హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల సాంగ్స్ లో కూడా ఆడిపాడింది ఈ భామ. పైగా ‘6 టీన్స్’ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది.
ఇదిలా ఉండగా.. కొన్నేళ్లుగా రాఖీ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఎన్నో హిందీ టీవీ షోలలో పాల్గొన్న రాఖీ.. ఐటమ్ హీరోయిన్ గా, బుల్లితెర స్టార్ గా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. కానీ.. ఎప్పుడూ ఏదొక వివాదంతో హాట్ టాపిక్ గా మారుతుండటం గమనార్హం. 2019లో ఓ ఎన్ఆర్ఐని పెళ్లాడిన ఈ భామ.. మూడేళ్లకే విడాకులు తీసుకొని, రీసెంట్ మరో వ్యక్తిని పెళ్లాడింది. ఈ క్రమంలో పబ్లిక్ లో రాఖీ కనిపించిందని.. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికి దగ్గరగా వచ్చాడు. దీంతో.. ఆ అభిమానిని దగ్గరికి రావొద్దని, ఇప్పుడు తనకు పెళ్లయిందని.. పెళ్లి కాకముందు దగ్గరగా వస్తే పరవాలేదని వార్నింగ్ ఇచ్చింది. రాఖీ మాటలకు షాకైన అభిమాని.. దూరం నుండే పిక్ దిగి వెళ్లిపోయాడు.. ప్రెజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. కామెంట్స్ లో నెటిజన్స్ రాఖీని ఆడుకుంటున్నారు. మరి రాఖీ సావంత్ ఫ్యాన్ తో ప్రవర్తించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.