పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే.. సౌత్ ఇండియాలో హాలీవుడ్ పర్సనాలిటీ కలిగిన హీరో మహేష్ బాబు ఒక్కడే. మరి అలాంటి మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా? అనే ప్రశ్న.. వీరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుండే వెంటాడుతోంది. తాజాగా ఆ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం చెప్పి బ్రేక్ వేశాడు రాజమౌళి.
ఇటీవల ఓ హోలీవుడ్ అవార్డుల వేడుకలో పాల్గొన్న రాజమౌళి.. మహేష్ తో చేయబోయే సినిమా ఫుల్ లెన్త్ “గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్”గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పేశాడు. అప్పటినుండి రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై మరింత ఆసక్తితో పాటు ప్రేక్షకులలో ఈ “గ్లోబ్ ట్రోటింగ్” అంటే ఏంటి? అనే సందేహాలు మొదలయ్యాయి. మహేష్ బాబు లాంటి హాలీవుడ్ కటౌట్ ని రాజమౌళి జేమ్స్ బాండ్ తరహాలో చూపిస్తాడేమో అని అనుకుంటుండగా.. సరిగ్గా అలాంటి తీపికబురే చెప్పి సర్ప్రైజ్ చేశాడు జక్కన్న. తాను తీయబోయే సినిమాలో మహేష్ బాబు హాలీవుడ్ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడని చెప్పడం విశేషం. అదీగాక ఈ సినిమా ఆఫ్రికన్ నేపథ్యం కలిగి ఉంటుందని రచయిత విజయేంద్రప్రసాద్ ఇదివరకే అంచనాలు పెంచేశాడు.
ఈ క్రమంలో గ్లోబ్ ట్రోటింగ్ అర్థం ఏంటని ఆరా తీయగా.. ప్రపంచమంతా ట్రావెల్ చేయడం అని తెలిసింది. అంటే.. గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ అన్నారు కాబట్టి.. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే క్రమంలో ఎలాంటి సాహసాలు చేసాడనేది చూపించనున్నారేమో అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకూ గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో చాలా హాలీవుడ్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ది వే(2010), ఇంటూ ది వైల్డ్(2008), మోటార్ సైకిల్ డైరీస్(2004), లాస్ట్ ఇన్ ట్రాన్స్ లేషన్(2003), ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి(2013), హానరబుల్ మెన్షన్(2015), అవుట్ ఆఫ్ ఆఫ్రికా(1985), సైడ్ వేస్(2004), ఈట్ ప్రే లవ్(2010) లాంటి ఎన్నో సినిమాలు గ్లోబ్ ట్రోటింగ్(ట్రావెలింగ్) బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఇక ఇప్పుడు రాజమౌళి చేయబోయే సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ అడ్వెంచర్.. సో మరి ట్రావెలింగ్ లోనే ఏవైనా సాహసాలు చేయించనున్నాడేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి గతంలో మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తే బాగుంటుందని చెప్పాడు. మరి ఈ గ్లోబ్ ట్రోటింగ్ మూవీలో మహేష్ బాబు ప్రపంచం మొత్తం చుట్టేయబోతున్నాడా? ఎలా అనేది తెరపై చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తన మూడో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూట్ మొదలైన ఈ సినిమా 2023 ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SSMB28 #SSMB29 #MaheshBabu pic.twitter.com/sILwMNCq32
— Aakashavaani (@TheAakashavaani) September 12, 2022