ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లో వసూళ్ల పరంగా సూపర్ అనిపించుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పుష్పరాజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వేట ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలై రెండు వారాలు దాటినప్పటికి.. అడియన్స్ ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. ఇటీవలే పుష్ప కలెక్షన్స్ పరంగా హిందీలో రికార్డు నమోదు చేసింది.
కేవలం 15 రోజుల్లోనే ‘పుష్ప’ హిందీ వెర్షన్ 50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇదివరకు హిందీలోకి డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలకు మంచి ఆదరణే లభించింది. ఇదే క్రమంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 16 రోజుల్లో 56 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. హిందీ మాత్రమే కాకుండా కేరళలో పుష్ప కలెక్షన్స్ పరంగా నాన్- బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది.కేరళలో బాహుబలి తర్వాత అత్యధిక గ్రాస్ వసూలు చేసిన డబ్ మూవీగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదివరకు కేరళలో బన్నీ నటించిన ‘సరైనోడు'(7.2కోట్లు) పేరిట ఉన్న రికార్డును రూ.11 కోట్లతో ‘పుష్ప’ బ్రేక్ చేసింది. తాజా లెక్కల ప్రకారం.. హిందీ, కేరళ బయ్యర్స్ ఈ సినిమాతో లాభాల బాటపట్టినట్లు తెలుస్తోంది. అటు హిందీ ఇటు కేరళ బాక్సాఫీసుల వద్ద పుష్ప కలెక్షన్ల సందడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.