ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ గురించి కొన్ని ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ కాగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాని భారీ స్థాయిలో నిర్మించారు. ఇక టైటిల్ రోల్.. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ యాటిట్యూడ్, భాష, యాస.. ఇలా అన్నీ మాస్ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీని ఎప్పుడు ఫ్యాన్స్ చూడలేదు. అదీగాక పాన్ ఇండియా వైడ్ పుష్పరాజ్ క్యారెక్టర్ జనాలకు బాగా ఎక్కేసింది.
ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో జరుపుకుంటోంది. ఈసారి ఏదేమైనా మొదటి భాగానికి మించి ఉంటుందని బన్నీ కూడా ప్రెస్ మీట్స్ లో తెలిపాడు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి కొత్త కొత్త అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కి సంబంధించి కొత్తగా నెట్టింట కొన్ని ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. పుష్ప 2 షూటింగ్ దశలో ఉండగానే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతోందట.
తాజా సమాచారం ప్రకారం.. పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే థియేట్రికల్ బిజినెస్ ద్వారా రూ. 1000 కోట్లకు పైగా లాభాలు కురిపిస్తోందట. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ.. ఎక్కడా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. కాగా.. పుష్ప సినిమా ఇండియాలోనే కాకుండా వైరల్ రీల్స్, సాంగ్స్ ద్వారా వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో వెయ్యి కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదని ఫ్యాన్స్, నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. పుష్ప మొదటి భాగం వచ్చేసి.. రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి.. ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. మరి పుష్ప 2 ఎలాంటి మ్యాజిక్ చేయనుందో తెరపై చూడాల్సిందే. ఇక పుష్ప 2 మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.