ఈ మధ్యకాలంలో తెలుగు, కన్నడ, మలయాళ వంటి భాషలతో సంబంధం లేకుండా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. భాష ఏదైన మాకు సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే చాలంటూ చిన్న సినిమాను సైతం సూపర్ హిట్ మూవీగా నిలబెడుతున్నారు. అయితే ఇలాగే వచ్చి కాంతార మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజైన నాటి నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకుపోతూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
రిషబ్ శెట్టి హీరోగా, స్వియ దర్శకత్వంలో కాంతార మూవీని తెరకెక్కించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తో కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని థియేటర్ లో చూడని జనాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార మూవీ నవంబర్ 4 నుంచి ఓ ప్రముఖ ఓటీటీలో రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమేనని ప్రేక్షకులు సంతోషపడుతున్నారు.
ఈ సమయంలోనే ఈ వార్తలపై తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు కాంతార మూవీ నిర్మాత కార్తిక్ గౌడ. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇవి రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. నవంబర్ 4 నుంచి ఓటీటీలోకి కాంతార అనే వార్త అవాస్తవమని, కాంతార ఓటీటీలోకి ఎప్పుడు రానుందనే విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటిస్తుందని కార్తిక్ గౌడ ట్విట్టర్ లో తెలిపారు. కార్తిక్ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే వాస్తవానికి కాంతార మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ కాంతార ఓటీటీలోపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.
Wrong News! We will let you know when it is coming but certainly not November 4th. https://t.co/uU30w9jVC1
— Karthik Gowda (@Karthik1423) October 27, 2022