దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలుచుకుంటూ భారతీయ సినిమా సత్తా చాటుతోంది. అయితే ఏ అవార్డు వేడుకలోనూ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కనిపించడం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిక భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన ఈ మూవీ.. విదేశీ ప్రేక్షకుల ఆదరణనూ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అమెరికన్ ఫిల్మ్ ఆడియెన్స్ అయితే జక్కన్న డైరెక్షన్, తారక్ – చెర్రీ యాక్టింగ్ టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది.
హాలీవుడ్లో ప్రముఖంగా చెప్పుకునే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)’ అవార్డుల్లోనూ ఏకంగా ఐదింటిని సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచ యవనికపై చాటింది ‘ఆర్ఆర్ఆర్’. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘బ్లాక్ పాంథర్’, ‘బ్యాట్‌మ్యాన్’, ‘ది విమెన్ కింగ్’, ‘టాప్ గన్ మేవరిక్’ లాంటి వాటిని తోసిరాజని ‘ఆర్ఆర్ఆర్’ విజేతగా నిలిచింది. అయితే.. ఈ అవార్డుల వేడుకకు రాజమౌళి, రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, జక్కన్న తనయుడు కార్తికేయ హాజరయ్యారు. ఇందులో ఎన్టీఆర్ మిస్సయ్యారు. కొరటాల శివ సినిమాతో తారక్ బిజీగా ఉన్నారు. అందుకే ఆయన అవార్డు కార్యక్రమానికి రాలేకపోయారని హెచ్‌సీఏ తెలిపింది.
హెచ్‌సీఏ పురస్కారాల వేడుకతో పాటు ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్‌కూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి మరో కీలక వ్యక్తి రాలేదు. ఆయనే నిర్మాత డీవీవీ దానయ్య. హెచ్‌సీఏతో పాటు గోల్డెన్ గ్లోబ్స్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ అవార్డులను గెలుచుకుంది. కానీ దీనికి చిత్ర నిర్మాత దానయ్య మాత్రం హాజరవ్వలేదు. ఆయన తప్ప సినీ యూనిట్‌లోని మిగతా కీలక సభ్యులు అందరూ అటెంట్ అయ్యారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డులు వస్తున్నా.. విదేశీ పర్యటనల్లో మూవీ టీమ్ పాల్గొంటున్నా.. అన్నింట్లో నిర్మాత దానయ్య ఎందుకు కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరిగే ఆస్కార్ వేడుకకైనా దానయ్య హాజరవుతారా అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో దానయ్య ఎందుకు ట్రావెల్ కావడం లేదనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.