బాలీవుడ్లో అగ్రకథానాయికగా కొనసాగుతూనే హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడా సత్తా చాటుతోంది ప్రియాంక చోప్రా. నిక్ జొనాస్‌తో పెళ్లయ్యాకా అంతర్జాతీయంగా మరింత పాపులర్ అయ్యింది. పలు అంతర్జాతీయ వేదికలపై గౌరవాలు, సత్కారాలు అందుకుంటోంది. తమిళ చిత్రం ‘తమిజాన్’తో నాయికగా కెరీర్ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్లో స్టార్ కథానాయికగా ఎదిగింది. జాతీయస్థాయి ఉత్తమ కథా నాయికగా పురస్కారం అందుకుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం సిటాడెల్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రియాంక చోప్రాకు గాయాలయ్యాయి.
ముఖంపై రెండు చోట్ల ప్రియాంకకు గాయాలైనట్టు కనిపిస్తొంది. ఐ బ్రో పై లోతుగా గాయమైనట్టు కనిపిస్తోంది. షూటింగ్ లో తనకు గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందిదాంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుకున్నారు. షూటింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. నిక్ జోన్స్ ను వివాహం చేసుకున్న ప్రియాంక్ లండన్ కు మకాం మార్చింది. ఇక ఓ వైపు హాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.