తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా. ప్రీతి ఇలా ట్రోలింగ్ కు గురవ్వడానికి కారణం ఓ వికలాంగ భిక్షటన చేసే వ్యక్తి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా విమర్శలకు, ట్రోల్స్ కు గురవుతుంటారు. కొన్ని కొన్ని సార్లు తెలిసో.. తెలియకో.. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల వారు భయంకరమైన ట్రోలింగ్ ను ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటోంది బాలీవుడ్ బ్యూటీ.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా. తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది ఈ భామ. ప్రీతి ఇలా ట్రోలింగ్ కు గురవ్వడానికి కారణం ఓ వికలాంగ భిక్షటన చేసే వ్యక్తి. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే బిజీలో సదరు వికలాంగ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది ప్రీతి జింతా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రీతి జింతా.. బాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సొట్ట బుగ్గలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తూనే బిజినెస్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టుకు సహయజమానిగా ప్రీతి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రీతి జింతాపై విమర్శలతో పాటుగా ట్రోలింగ్ లు వస్తున్నాయి. అసలు ప్రీతిపై ట్రోలింగ్ కు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హడావిడిలో ప్రీతి జింతా ఎయిర్ పోర్ట్ కు వెళ్తోంది. ఆ టైమ్ లో ప్రీతి కారు దగ్గరకి వీల్ ఛైర్ వేసుకుని భిక్షాటన చేస్తూ.. ఓ వికలాంగ వ్యక్తి వచ్చాడు. మేడం ప్లీజ్ ఎంతో కొంత ఇవ్వండి అంటూ అభ్యర్థించాడు. అయితే ఇది గమనించకుండా ప్రీతి కారులో ఎక్కి కూర్చుంది. దాంతో కారు ముందుకు పోయింది. అయినా గానీ ఆ వికలాంగ వ్యక్తి కారును అందుకుందామని, ఎంతో కొంత ఇవ్వకపోదా అని దాన్ని కొంత దూరం వెంబడించాడు. అయినా కానీ ప్రీతి కారు ఆపలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో ప్రీతి జింతాపై ట్రోల్స్ వస్తున్నాయి.
రూ. 100 కోట్లు పెట్టి ఐపీఎల్ లో జట్టు కొనొచ్చు కానీ.. ఈ వికలాంగుడికి ఇద్దానికి రూ. 100 రూపాయలు కూడా లేవా అంటూ తిట్టిపోస్తున్నారు. పాపం ఎంతో ఆశ పడ్డాడు, ఎంతో కొంత ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాపం అతడు ఎంత దీనంగా అభ్యర్థించాడో చూస్తే.. మాకే జాలేస్తోంది.. ప్రీతి ఎందుకు ఇలా చేశావ్ అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ప్రీతి జింతా ఇది గమనించి కూడా ఇలా చేసిందా? లేక బ్లాక్ కలర్ గ్లాస్ వల్ల గమనించ లేదా? అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రీతి జింతా ఆ వ్యక్తి పట్ల ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.