బాక్సాఫీస్ మాన్‌స్టర్.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 240 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో అయితే రాఖీ భాయ్ అడ్డాగా మారిపోయింది. ఈ సినిమా రెండ్రోజుల్లో బీ టౌన్ లో దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్.. ఆ తర్వాత ప్రేక్షకుల మతిపోగొట్టింది. తాజాగా విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు మించి రాణిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా చివర్లో ఛాప్టర్ 3 కూడా రాబోతోంది అని చిన్న పీలర్ ఇచ్చి వదిలేశాడు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఎలా ఉండబోతోంది? ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.
ఇదీ చదవండి: ఇండియన్ సినిమాపై టాలీవుడ్ మార్క్! ఫ్యూచర్ అంతా మనదే!
కేజీఎఫ్ మొదటి పార్ట్ కథ పరిశీలిస్తే.. తన తల్లి మరణంతో ఆమెకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు రాఖీ అనే పిల్లాడు ముంబైలో అడుగుపెట్టాడు. అక్కడ తినేందుకు తిండి లేక, పడుకునేందుకు మూడడుగుల చోటు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ముంబైలో బతకాలంటే అవతలి వాడి చెయ్యి ఎత్తేలోపు మన దెబ్బ వాడిపై పడాలని తెలుసుకున్నాడు. రాఖీ అనేది పేరుకాదు.. ఓ బ్రాండ్ అనే స్థాయికి ఎదిగాడు. స్వయం ప్రకటిత గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయి మొత్తం ముంబైని పరోక్షంగా ఏలేస్తుంటాడు. గరుడను చంపేందుకు నరాచీకి వెళ్లి కేజీఎఫ్ ను ఆక్రమిస్తాడు. అక్కడితో మొదటి పార్ట్ ను ముగించారు.
ఆ తర్వాత మొత్తం నరాచీని తన అధీనంలోకి తీసుకుని సింహాసనాన్ని అధిష్టిస్తాడు. రెండో పార్ట్ లో రాఖీకి సవాళ్లు ఎదురవుతాయి. అధీరా తిరిగొచ్చేస్తాడు. మొత్తం నరాచీ చేయిదాటిపోయే పరిస్థితి వస్తుంది. విలన్స్, అధీరా, దేశ ప్రధాని రాఖీని టార్గెట్ చేసి నామరూపాలు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాళ్లందరినీ ఎదిరించి రాఖీ తన తెలివితేటలతో విజయం సాధిస్తాడు. ఈ పార్ట్ లో రాఖీ పాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం. అతని రేంజ్ దేశం నలుమూలలకు చేరుతుంది. ఇక్కడ సినిమా ఎండ్ చేసే ముందు డైరెక్టర్ ఓ హింట్ ఇచ్చాడు.
Thu kya main kya Hatja Hatja 🔥
𝐓𝐨𝐨𝐟𝐚𝐧 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 ⚡#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/aiiuD8qttp— #KGFChapter2 – Box Office Monster 🔥 (@KGFTheFilm) April 16, 2022
ఇదీ చదవండి: KGF 2 రికార్డ్స్.. రికార్డ్స్.. రెండోరోజూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదుగా!
అదేంటంటే.. అనంత్ నాగ్ గ్రంథాలయంలో ఛాప్టర్ 3 బుక్లెట్ చూపించారు. అంతేకాదు.. రాఖీని వెతుక్కుంటూ అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) అధికారులు రావడం, రాఖీ గురించి చర్చిస్తూ కనిపిస్తారు. అంటే ఈ పార్ట్ లో రామకృష్ణప్ప బేరియా రేంజ్ ఇంటర్నేషల్ కు పాకనున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ ముంబైకి పరిమితం చేసి.. ఛాప్టర్ 2లో నేషనల్ వాంటెడ్ క్రిమినల్ స్థాయి చూపించారు. ఇంక ఛాప్టర్ 3లో కచ్చితంగా స్టోరీ రాఖీభాయ్ ని ఇంటర్నేషనల్ క్రిమినల్ స్థాయికి చేరుస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్, హీరోని చూపించే తీరు చూస్తే అదేమీ అసాధ్యం అని చెప్పలేం. ప్రపంచంవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన రామకృష్ణప్ప బెరియా అలియాస్ రాఖీ భాయ్ ని కలుసుకోవాలంటే ఇంకా కొన్నేళ్లు పట్టచ్చు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఉంటే.. ఎలా ఉండబోతంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.