కేజీఎఫ్ 2 హవాలో ఏ మాత్రం మార్పులేదు. బాక్సాఫీసుల వద్ద రాఖీభాయ్ దండయాత్ర కొనసాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ సృష్టించిన రాఖీని చూసేందుకు ఉవిళ్లూరుతున్నారు. హిందీ ప్రేక్షకులు కేజీఎఫ్ 2 సినిమాకి నీరాజనాలు పడుతున్నారు. ఎంతగా అంటే స్ట్రైట్ హిందీ సినిమాలు కూడా చిన్నబోయేలా రాఖీ రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. బాక్సాఫీస్ కా మాన్‌స్టర్ అని రుజువు చేశాడు. మొదటి రోజు దేశవ్యాప్తంగా 134.5 కోట్లు కలెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 రెండో రోజు కూడా హవా కొనసాగిస్తోంది.
బాలీవుడ్ లో కేజీఎఫ్ రికార్డులు చూస్తుంటే అక్కడి దర్శకనిర్మాతలకు నిద్ర పట్టేలాలేదు. ఎందుకంటే మొదటి రోజు బాలీవుడ్‌లో 53.95 కోట్లు కలెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 రెండో రోజు కూడా రికార్డులు సృష్టించింది. డే2 టాప్ కలెక్టెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. బాహుబలి-2, సంజు, రేస్ 3, సుల్తాన్, ట్రిపులార్ వంటి సినిమాల రికార్డులను తుడుచిపెట్టేసింది. డే2 కలెక్షన్స్ లోనూ టాప్ ప్లేస్ లో నిలిచింది.
డే2 టాప్ కలెక్టెడ్ మూవీస్ ఇన్ బాలీవుడ్
కేజీఎఫ్ ఛాప్టర్ 2 45 కోట్లు
బాహుబలి 2 40.5 కోట్లు
సంజు 38.6 కోట్లు
రేస్ 3 38.14 కోట్లు
సుల్తాన్ 37.32 కోట్లు
ట్రిపులార్ 24 కోట్లు
కేజీఎఫ్ ఛాప్టర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.