చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్‘. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విశేషదారణ పొందుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం ‘100 కోట్ల క్లబ్’లో చేరుకుంది. ప్రధాని మోడీ నుండి సాధారణ పౌరుడి వరకు కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం.. 1990లలో కశ్మీర్ పండిట్స్ పై జరిగిన అఘాయిత్యాలను తెరపై చూపిస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఈ సినిమా పై ఎక్కువ శాతం పాజిటివ్ గా స్పందించగా.. కొందరు వివాదాలకు దారితీసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. కశ్మీర్ ఫైల్స్ పై సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.“ఈ కశ్మీర్ ఫైల్స్.. చిత్రం గాయాలను నయం చేస్తుందా? రేపుతుందా? లేదా ద్వేషం విత్తనాలు నాటుతుందా?” అని ట్వీట్ చేసి, ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఉద్దేశం పై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ట్వీట్ ఎలాంటి చర్చలకు దారితీస్తుందో చూడాలి. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇక కశ్మీర్ ఫైల్స్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022