పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిన్నపాటి ఆరోగ్య కారణాలతో ప్రభాస్ స్పెయిన్ వెళ్లాడు. అక్కడ ప్రభాస్ కు చిన్నపాటి సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ప్రభాస్ ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత షాక్ కు గురయ్యారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు వైరల్ గా మారాయి.
ఇదీ చదవండి: వెరైటీ డ్రెస్ లో తమన్నా.. వీడియో వైరల్
ఇంక సినిమాల విషయానికి వస్తే.. మార్చి 11న విడుదలైన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విధిని, విధాతను ఎదిరించి గెలిచిన ప్రేమికుడిగా ప్రభాస్ అందరి హృదయాలను కొల్లగొట్టాడు. ప్రభాస్ కు జరిగిన సర్జరీ, వైద్యులు విశ్రాంతి తీసుకోమనడం చూస్తుంటే వరుస ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ పడుతుందనే తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.