పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బబ్లీ బౌన్సర్ సినిమాతో బాలీవుడ్ లో డీసెంట్ హిట్ కొట్టిన తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’, బాలీవుడ్ మూవీ ‘బోలె చుడియన్’ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అలరించిన ఈ మిల్కీ గెలాక్సీ ఇప్పుడు మలయాళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోతుంది.
తమన్నా బాంద్రా అనే సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది. ఒక పక్క ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే.. మరోపక్క తమన్నా కూడా సినిమాలు, ఫోటో షూట్లు అంటూ యమ బిజీగా ఉంది. మరి ఈ ఇద్దరికీ కలిసి చెస్ ఆడేంత సమయం ఎక్కడ ఉంటుంది? సినిమా షూటింగ్ లంటే తినడానికే సమయం ఉండదు. అలాంటిది తీరిగ్గా చెస్ ఆడేంత సమయం కూడానా? పైగా ప్రభాస్.. తమన్నాకి చెస్ ఇలా ఆడాలి అని నేర్పుతున్నారు. డార్లింగ్ కి అంత టైం ఎక్కడిది అనే ప్రశ్న మొలకెత్తడం అనేది సహజమే. డార్లింగ్ తమన్నాకి చెస్ నేర్పుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు. రెబల్ సినిమా షూటింగ్ సమయంలో వీడియో అది. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమాలో ఈ ఇద్దరూ జోడీగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్, తమన్నా చదరంగం ఆట ఆడారు. ఈ క్రమంలో ప్రభాస్.. తమన్నాకి చెస్ ఎలా ఆడాలో నేర్పుతున్నారు. బిహైండ్ ది సీన్స్ అంటూ ఒక వీడియోని ప్రభాస్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ కి మైండ్ గేమ్ అయిన చదరంగం అంటే ఎంత ఇష్టమో అని కామెంట్స్ చేస్తున్నారు. ‘డార్లింగ్ మాకు కూడా చెస్ నేర్పించు; అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I also wanna learn chess ♟️
From .#Prabhas garu😁
Darling teaching
.@tamannaahspeaks chess
Rebel BTS rare unseen 🤩 pic.twitter.com/wJKzbYw5Tf— Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) November 2, 2022