నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్‘ సెలబ్రిటీ టాక్ షో ఎంత విజయవంతంగా ప్రదర్శితం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ తోనే దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్ సంపాదించుకున్న ఈ టాక్ షో.. తెలుగు ఓటిటి ఆహా పేరు మరింత మార్మోగేలా చేసింది. అయితే.. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది స్టార్స్ హాజరైన ఈ షోకి త్వరలో పాన్ ఇండియా స్టార్ రాబోతున్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రోజురోజుకూ అన్ స్టాపబుల్ షో క్రేజ్ పెరుగుతూ పోతుండటంతో.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడని తెలిసేసరికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంతకీ ఎవరా పాన్ ఇండియా స్టార్ అనుకుంటున్నారా.. డార్లింగ్ ప్రభాస్. అవును.. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ 2’ షోలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అదికూడా ఒంటరిగా కాదు.. తన బెస్ట్ ఫ్రెండ్ మాచో హీరో గోపీచంద్ తో రాబోతున్నాడట. అయితే.. వీరి ఎపిసోడ్ కూడా వచ్చే శుక్రవారం అంటే.. డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా.. ప్రభాస్ – గోపీచంద్ ల ఎపిసోడ్ ని డిసెంబర్ 11న(ఆదివారం) షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అటు డార్లింగ్ ఫ్యాన్స్, ఇటు గోపీచంద్ ఫ్యాన్స్ ఎక్సయిట్ మెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ – గోపీచంద్ ల ఎపిసోడ్ తర్వాత బాలయ్య షోకి సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద కూడా సంయుక్తంగా హాజరు కానున్నారట. ఇక ఓవైపు సినిమాలు చేస్తూనే, అన్ స్టాపబుల్ షోని మేనేజ్ చేస్తున్న బాలయ్య.. సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ చేస్తున్నాడు. మరోవైపు డార్లింగ్ ప్రభాస్.. ఆదిపురుష్ పూర్తిచేసి సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇక గోపీచంద్ విషయానికి వస్తే.. ఈ ఏడాది పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీవాస్ తో తన మూడో సినిమా చేస్తున్నాడు. చూడాలి మరి బాలయ్య షోలో ప్రభాస్ – గోపీచంద్ ల సందడి ఎలా ఉండబోతుందో!
Rebelstar #Prabhas episode on #UnstoppableWithNBKS2 shoot with Natasimham #NBK on 11th Dec 💥
Can’t wait for this energetic episode, Get ready for a blast 🔥🌋 pic.twitter.com/3ryiwtT87N— Prabhas Trends™ (@TrendsPrabhas) December 7, 2022
#prabhas #gopichand and #NBK Going to set small screens on fire 🔥🔥🔥
REBEL STAR in #UnstoppableWithNBKS2 💥 pic.twitter.com/CLtU5fFPMZ
— NANI || DHFPB 3 || 🪖 (@nanidhfpbkcpd3) December 10, 2022