నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. గతేడాది తెలుగు ఓటిటి ఆహాలో మొదలైన ఈ షో.. మొదటి సీజన్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొని.. ఐఎండిబిలో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఇదే షో సెకండ్ సీజన్ విషయానికి వచ్చేసరికి అంచెలంచెలుగా క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. ఇదివరకు ఎన్నడూ, ఏ టీవీ షోకి రాని బజ్, ఆదరణ ‘అన్ స్టాపబుల్ 2’ నమోదు చేస్తోంది. బాలయ్య షో అంటే.. ఆ మాత్రం ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. రాబోయే ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాచో స్టార్ గోపిచంద్ ఇద్దరూ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రభాస్ ఎంట్రీకి సంబంధించి ఫోటోలు, ప్రోమోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అదీగాక ప్రభాస్ – గోపీచంద్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఎపిసోడ్ ప్రోమో.. యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండటం విశేషం. అయితే.. మొదటి సీజన్ లో దాదాపు సెలబ్రిటీలంతా సింగిల్ గా, లేదా సినిమా టీమ్ తో షోలో హాజరయ్యారు. కానీ, ఈసారి మాత్రం ఎపిసోడ్ కి ఇద్దరినీ ఇన్వైట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ వస్తున్న ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ప్రభాస్ షర్ట్ ధర కనుక్కోవడానికే ఎంతో ట్రై చేశారు. అలాంటిది ప్రభాస్ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే ఎంత ఆసక్తి ఉంటుంది.
ఇక ప్రభాస్ తో బాలయ్య ఎపిసోడ్ షూట్ ఇటీవలే ముగిసింది. ఈ షోకి ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా వచ్చేసరికి ఫ్యాన్స్ పెద్దఎత్తున వచ్చారు. ఇక షూట్‌కి సంబంధించి పిక్స్, వీడియోలు నెెట్టింట హంగామా చేశాయి. తాజాగా వీరి ఎపిసోడ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో డైలాగ్స్ ఏమి లేవుగాని.. ప్రభాస్ ఎక్సప్రెషన్స్ మాత్రం హైలైట్ అయ్యాయి. దీంతో ఇది గ్లింప్స్ కే ఇలా ఉంటే.. ట్రైలర్ వచ్చాక పరిస్థితి ఏంటనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ – బాలయ్యల ఎపిసోడ్ ని ఇయర్ ఎండింగ్ లో.. అంటే డిసెంబర్ 31న స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో ఆహా నిర్వాహకులు ఉన్నట్లు టాక్.
ఇప్పటికే న్యూ ఇయర్ కి సంబంధించి హంగామా మొదలైపోయింది. డిసెంబర్ 31 అంటే.. అప్పుడంతా ఫుల్ పార్టీ మూడ్ లో ఉంటారు. పైగా ఆ టైంలోనే అందరూ క్రికెట్, సినిమాలంటూ థియేటర్స్ లో సందడి కూడా ఉంటుంది. అలాంటిది బజ్, క్రేజ్ పరంగా టాప్ లో ఉన్న అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్స్ కూడా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రభాస్ – గోపీచంద్ – బాలయ్య కలిసిన ఎపిసోడ్ ని రెండు తెలుగు రాష్ట్రాలలోని సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించే ప్లాన్ లో నిర్వాహకులు ఉన్నారని సినీవర్గాలలో కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి గంటలోపు ఉండే ఎపిసోడ్ ని ప్రేక్షకులు, ఫ్యాన్స్ థియేటర్స్ లో చూసి పండగ చేసుకునే అవకాశం ఉంది. సో.. ఆ థ్రిల్ ఫ్యాన్స్ కి అందించాలని అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని థియేటర్స్ లో ప్లాన్ చేస్తున్నారట. దీనిలో నిజమెంత అనేది తెలియాల్సి ఉండగా.. ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్ ని థియేటర్స్ లో వేస్తే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలు కామెంట్స్ ;లో తెలపండి.