ఓటీటీలో హిస్టరీలో ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్ లోడ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఇప్పటికే ఎందరో సినిమా, రాజకీయ ప్రముఖులను బాలకృష్ణ తనదైనశైలిలో ఇంటర్వ్యూ చేేశారు. ఇప్పుడు ఈ షోలోకి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొంటారని వార్తలు వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. మంగళవారం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ హుడీలో పవన్ కల్యాణ్- బ్లాక్ సూట్ బాలయ్య ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటూ, కౌగిలించుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. షూట్ లొకేషన్ కి సంబంధించిన ఫొటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ ఎపిసోడ్ కి సబంధింటి టాక్ రాగానే బాలయ్య- పవన్ ఫ్యాన్స మాత్రమే కాదు.. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి పెద్దఎత్తున చర్చ నడిచింది. కొందరైతే ఈ ఇంటర్వ్యూ జరగదు.. అవి పుకార్లే అంటూ ఎద్దేవా కూడా చేశారు.
Unstoppable with NBK * PSPK episode loading 👌 pic.twitter.com/GuOOClped7
— Sabrish Mutyala (@Sabrish110) December 27, 2022
అసలు వీళ్ల నిజంగానే షో చేస్తారా? ఇద్దరూ సినిమాలు, రాజకీయాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఏం ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సినిమాల పరంగా ప్రశ్నలు ఉంటాయా, రాజకీయంగానూ ప్రశ్నలు అడుగుతారా? ఇద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయంగా వీళ్ల పార్టీల పొత్తులకు సంబంధించి ఏమైనా సమాచారం చెప్తారా అంటూ అంతా తెగ ఆలోచిస్తున్నారు. మరి.. వీళ్ల ఇంటర్వ్యూ ఎలా సాగుతుందో ఒక్క ప్రోమో అయినా రిలీజ్ అయితేగానీ చెప్పలేం. ఈ ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేస్తారని తెలుస్తోంది.
Poster Launch 💥🔥 @PawanKalyan At #UnstoppableWithNBKS2
Mass God @PawanKalyan With #Nbk Garu pic.twitter.com/dr6eDDRbc1
— Ardent PSPK Cults™ (@ArdentPSPKCults) December 27, 2022
ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య- పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. బాలయ్య సాంగ్ షూట్, పవన్ హరిహర వీరమల్లు సినిమా షూట్ కూడా అక్కడే కావడంతో ఇద్దరూ కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఓటీటీల్లోనే ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు బాలయ్య- పవన్ అభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. NBK విత్ PSPK అంటూ వాళ్లిద్దరూ హగ్ చేసుకున్న ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా, సినిమాల పరంగా ఈ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది.
PK Arrived…#UnstoppableWithNBKS2 pic.twitter.com/Q2MLT5xweF
— Fukkard (@Fukkard) December 27, 2022