ఇప్పుడు కొత్త సినిమా విడుదలయ్యిందంటే.. థియేటర్లకు పరుగెత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. టీవీ, సెల్ ఫోన్స్‌లో కొత్త సినిమాలు చూసే అవకాశం వచ్చేసింది ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రూపంలో. పెరుగుతున్న సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి.
శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా ప్రియులకు పండుగే. ఇప్పుడు కొత్త సినిమా విడుదలయ్యిందంటే.. థియేటర్లకు పరుగెత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. టీవీ, సెల్ ఫోన్స్‌లో కొత్త సినిమాలు చూసే అవకాశం వచ్చేసింది ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రూపంలో. పెరుగుతున్న సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. గతంతో పోలిస్తే వీటి హవా కూడా ఎక్కువగా ఉంది. మంచి కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. అలాగే ఇంకా ఓటీటీలపై అదుపు లేకపోవడంతో రా అండ్ రస్టిక్‌గా కూడా తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ వారం విడుదలయ్యే సినిమాల జాబితాను ఓ సారి చూసేద్దాం.
ఆనందో బ్రహ్మ, యాత్ర దర్శకుడు మహి. వి రాఘవ నుండి వస్తున్న మరో వెబ్ సిరీస్ సైతాన్. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్లీన్ కామెడీతో వచ్చిన సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ కూడా ఆయన. చూడటానికి బోల్ట్ కంటెంట్ సిరీస్‌లా కనిపిస్తున్న సైతాన్.. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ హీరో విజయ్ ఆంథోనీ మూవీ బిచ్చగాడు-2 కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక తమన్నా ముద్దులతో రెచ్చిపోయిన జీ ఖర్దా సిరీస్ 5 భాషల్లో ఎవలబుల్‌గా ఉంది. టూ సోల్స్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్స్‌ట్రాక్షన్-2 మూవీ కూడా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో లభించనుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు,సిరీస్ లతో సందడి చేయనున్నాయి. ఒక్క 16వ తేదీన సుమారు 15 సినిమాలు వీక్షించవచ్చు.
సైతాన్ -7 భాషల్లో (హాట్ స్టార్)-స్ట్రీమింగ్ అవుతోంది (వెబ్ సిరీస్)
జీ ఖర్ధా-5 భాషల్లో (హాట్ స్టార్)-స్ట్రీమింగ్ అవుతోంది (వెబ్ సిరీస్)
రాఫుచక్కర్ -8 భాషల్లో-జియో సినిమా- స్రీమింగ్ అవుతోంది.
ద ఫుల్లీ మంత్ (ఇంగ్లీష్)- హాట్ స్టార్
హైవే లవ్ (హిందీ)-అమెజాన్ మినీ టీవీ
అన్ని మంచి శకునములే (ఐదు భాషల్లో)-అమెజాన్ ప్రైమ్ లో జూన్ -17 నుండి..
బిచ్చగాడు-2 ఆదివారం నుండి నాలుగు భాషల్లో హాట్ స్టార్‌లో లభించనుంది..
టూ సోల్స్ (తెలుగు) ప్రైమ్ వీడియో- స్ట్రీమింగ్ అవుతోంది
కనులు తెరిచినా, కనులు మూసినా (తెలుగు)-ఈటీవీ విన్
తమిళరాసన్ (తమిళ్)-జీ5
రావణకొట్టం (తమిళ్)- ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్
ఛార్లెస్ ఎంటర్ ప్రైజెస్, తారమ్ తీర్థ కూదరమ్ (మలయాళం)- ప్రైమ్ వీడియో
ఐలవ్ యూ (హిందీ)-జియో సినిమా, వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్, జపనీస్ సినిమాలు రాబోతున్నాయి.