సినీ చరిత్రలో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది. అది డైరెక్టర్ రాజమౌళి మూవీ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ తెగ ఆనందపడిపోతున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆలోచనలో పడిపోతున్నారు. ఇంతకీ ఎందుకో తెలుసా?
ఓ డైరెక్టర్ సినిమా తీయడం గ్రేట్ కాదు! దాన్ని జనాల్లో తీసుకెళ్లి హిట్ కొడితేనే గ్రేట్. ఈ విషయంలో మిగతా దర్శకుల సంగతేమో కానీ SS రాజమౌళి మాత్రం కాస్త డిఫరెంట్. తాను తీసే సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు గూస్ బంప్స్ తెప్పించే కంటెంట్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రమోషన్స్ చేయడంలోనూ రాజమౌళి పంథానే వేరు. ఓ సాధారణ డైరెక్టర్ అయిన రాజమౌళి.. 8 ఏళ్ల క్రితం ‘బాహుబలి’తో హిట్ కొట్టి ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకున్నాడు. అప్పుడు కొందరే గుర్తించారు. అదే మూవీ సీక్వెల్ తో మరోసారి మెప్పించేసరికి రాజమౌళి ఎవరా అని మాట్లాడుకున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చూసి ఆకాశానికెత్తేశారు. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో సినిమాను అభిమానించే ప్రతిఒక్కరూ జక్కన్నని గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడినట్లు కనిపిస్తుంది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా తీయడం, హిట్ కొట్టడం అందరు డైరెక్టర్స్ చేస్తారు. కానీ వరసగా 12 సినిమాలు తీసి వాటన్నింటితోనూ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం అంటే సాధారణమైన విషయం కాదు. రాజమౌళి దాన్ని రియాలిటీలో చేసి చూపించాడు. జక్కన్నతో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లకు డేట్స్ ఇవ్వడం దగ్గర నుంచి కష్టం కూడా మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే పడాల్సి ఉంటుంది. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలను ఎవరిని అడిగినా సరే ఈ విషయం చెప్పేస్తారు. అలానే రాజమౌళితో సినిమా అంటే హిట్ కొట్టడం గ్యారంటీ. అలా హీరోల తర్వాత సినిమాపై ఒత్తిడి చాలా పెరిగిపోతుంది. దీంతో ప్రతి హీరో దాదాపు ప్లాఫ్ అందుకుంటాడనేది చాలామంది తెలిసినమాట.
ఇప్పుడు ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో ఫర్ ది ఫస్ట్ టైమ్ డైరెక్టర్ రాజమౌళి.. తన తర్వాతి సినిమా విషయంలో ఒత్తిడిలో పడబోతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే జక్కన్న మూవీస్ అన్నింటిలోనూ దాదాపు కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి స్టోరీ తీసుకున్నా సరే దానికి కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తుంటాడు. మహేష్ బాబుతోనూ అడ్వంచర్ తరహా సినిమా తీయనున్నాడు. తాజాగా ‘RRR’కి ఆస్కార్ వచ్చింది కాబట్టి.. తర్వాత సినిమా విషయంలో తన వర్కింగ్ స్టైల్ లో ఏమైనా మార్పులు చేసి కాస్త రియాలస్టిక్ అంశాలు జోడిస్తాడా? లేదా తన బలమైన కమర్షియల్ యాంగిల్ లోనే వెళ్తాడా అనేది చూడాలి. అదే టైంలో ఆస్కార్ అనేది రాజమౌళి-మహేష్ సినిమా ప్లస్ లేదా మైనస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి రాజమౌళికి ఆస్కార్ రావడం, మహేష్ తో సినిమాపై ప్రెజర్ పెంచుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Sky Level Expectations on #SSMB29 🔥🔥@urstrulyMahesh @ssrajamouli #SSMBSSR pic.twitter.com/gOoe4ap41Y
— Urstrulyreddy 🔔 #SSMB28 (@Reddy01232) March 13, 2023