Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినగానే అందరికీ ఆరడుగుల అందగాడు, ఫిట్నెస్ ఫ్రీక్, హాలీవుడ్ హీరో స్ట్రక్చర్ ఇవన్నీ గుర్తొస్తాయి. అదే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఎన్ని సినిమాలు చేసినా ముందుగా పోకిరి, ఆ తర్వాతే ఒక్కడు.. దూకుడు, శ్రీమంతుడు ఇలా వరుసగా మైండ్ లో మెదులుతుంటాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ పై, టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పోకిరి మూవీ.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా.. 2006లో ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరి విడుదలై 16 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అది సృష్టించిన సునామిని ఎవరూ మర్చిపోలేదు.. మర్చిపోలేరు కూడా. మహేష్ బాబుతో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇన్నేళ్ళైనా పోకిరి, సినిమా టీవీలో వచ్చిందంటే చాలు.. కళ్లప్పగించేస్తారు ఆడియెన్స్.
ఇక వచ్చే నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అందరూ మరోసారి పోకిరి మూవీని థియేటర్లో ఎక్సపీరియెన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. పండుగాడు అలియాస్ ఐపీఎస్ కృష్ణమనోహర్ వీరంగాన్ని ఈసారి సరికొత్త డిజిటల్ సాంకేతికతను జోడించి.. 4K రిజల్యూషన్ లో రీమాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి రిలీజ్ కాబోతుంది.
అంతేగాక పోకిరితో పాటు ఒక్కడు సినిమా కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు. మరి ఒకేరోజు ఓవైపు పండుగాడు, మరోవైపు కబడ్డీ ప్లేయర్ అజయ్ సృష్టించబోయే రచ్చ మరోసారి రిపీట్ కాబోతుందన్నమాట. మరి ‘ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ధో ఆడే పండుగాడు’ డైలాగ్ ని మళ్లీ ఎక్సపీరియెన్స్ చేసేందుకు మీరు రెడీనా.. కామెంట్స్ లో తెలియజేయండి.