2004వ సంవత్సరంలో వచ్చిన 143 మూవీలో పంజాబీ ముద్దుగుమ్మ సమీక్ష హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్లుగా నటించి తమ నటనతో, అందంతో ప్రేక్షకుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించి హఠాత్తుగా మాయమయ్యారు. అలా హఠాత్తుగా మాయమై ఆ తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు తమ అభిమానుల ముందుకు వస్తూ ఉంటారు. 19 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక అగ్ర దర్శకుడి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?
దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్ లు మిగతా డైరెక్టర్ల సినిమాల్లోని హీరోయిన్ ల కంటే కొంచెం ప్రత్యేకతను కలిగి ఉంటారు. హీరోలతో పాటు ధీటుగా నటించి హీరోయిన్ అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనంగా ఉంటారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఆయన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా 143 అనే సినిమా వచ్చి పెద్ద విజయమే సాధించింది. 2004వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో పంజాబీ ముద్దుగుమ్మ సమీక్ష హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సమీక్ష అందానికి దాసోహం అయ్యారు. ఆమె నటన కూడా ఈ సినిమాలో చాలా క్యూట్ గా ఉంటుంది. నాగ చైతన్య హీరోగా వచ్చిన దడ మూవీలో కూడా సమీక్ష ఒక హీరోయిన్ గా చేసింది.
ఆ తర్వాత బ్రహ్మానందం డ్రామా కంపెనీ, కులుమనాలి, ఇదండీ సంగతి సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించింది. అలాగే పలు తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లో కూడా నటించింది. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించిన సమీక్ష ఎంతో మందికి ఫేవరేట్ నటీమణి కూడా. సమీక్ష 2020వ సంవత్సరంలో సింగపూర్ కి చెందిన ప్రముఖ సింగర్ షేల్ ఓస్వాల్ ని వివాహం చేసుకుంది. భర్త ఓస్వాల్ తో కలిసి కొన్ని సినిమాలని నిర్మించడంతో పాటు ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించింది. ఇటీవలే సమీక్షకి చెందిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ చూసిన వాళ్ళందరూ సమీక్షని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు.