బాహుబలి 2 సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశారని తెలిసిందే. తాజాగా కార్తికేయ 2 సినిమాలో పవన్ ను ఆదర్శంగా తీసుకుని ఒక సీన్‌ని తెరకెక్కించారట దర్శకుడు చందూ మొండేటి. అదేంటంటే.. ఈ మూవీలో అనుపమ జుట్టుని చూస్తూ.. నిఖిల్ న్యూడిల్స్ తినే సీన్ ఉంటుందట. ఆ సీన్లో నిఖిల్ స్టైల్‌గా న్యూడిల్స్ తింటూ ఉంటాడు. అయితే అలా స్టైల్‌గా తినడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ ఖుషి సినిమానే అని అన్నారు. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో పవన్ హీరోయిన్ జుట్టు తింటూ కనిపిస్తారని, దాన్ని ఆదర్శంగా తీసుకుని చందూ మొండేటి న్యూడిల్స్ సీన్ తీశారని నిఖిల్ చెప్పుకొచ్చారు. అనుపమ పరమేశ్వరన్ హెయిర్ స్టైల్ చూస్తే న్యూడిల్స్‌లా అనిపిస్తాయని, దాన్ని సింబాలిక్‌గా చూపిస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని అన్నారు.
బాహుబలి 2లో కూడా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఫ్యాన్స్ రియాక్షన్‌ని ఆదర్శంగా తీసుకుని ఇంటర్వెల్ సీన్‌ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఖుషి సినిమాలో ఓ సీన్లో పవన్‌ని ఆదర్శంగా తీసుకుని కార్తికేయ2 లో ఒక సీన్ క్రియేట్ చేశారు. విశేషం ఏంటంటే.. బాహుబలి 2, కార్తికేయ 2 ఈ రెండు సినిమాలు సీక్వెల్సే. ఇక సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 13న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. మరి ఈ మూవీలో ఒక సన్నివేశానికి ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఆదర్శమన్న నిఖిల్ కామెంట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.