పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఒక వైబ్రేషన్ కలుగుతుంది ఫ్యాన్స్‌కి, కాదు కాదు భక్తులకి. అవును ఏ హీరోకైనా ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్‌కు భక్తులు ఉంటారు. ఆ భక్తి ఎంతలా ఉంటుందో అనేది చాలా సందర్భాల్లో చూశాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్న భక్తుల భక్తి మాత్రం అంతకు మించి. పవన్ కళ్యాణ్ కోసం రక్తాన్ని కూడా లెక్కచేయలేదంటే పవన్ మీద ఏ స్థాయిలో భక్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు. అది కూడా తమిళనాడులో. పవన్ మీద తమ భక్తిని చాటుకోవడానికి వీళ్ళు ఏకంగా అక్కడ జరుపుకునే పండుగను ఎంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో కూడా పవన్ స్టార్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ పేరు వింటే అక్కడ కూడా పూనకాలతో ఊగిపోతుంటారు. తాజాగా పవన్ మీద తమకున్న భక్తాభిమానాన్ని ప్రదర్శించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తమిళనాడులో జరుపుకునే 'హోసూరు కావడి' పండుగలో కొంతమంది ఫ్యాన్స్ ఇనుప చువ్వలను వీపుకి గుచ్చుకుని జేసీబీ కొకైన్‌కి వేలాడుతూ.. పవన్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. తలైవా పవన్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే తమిళనాడు ఎన్టీఆర్ అభిమానులు ఇదే విధంగా తారక్ ఫ్లెక్సీలను వేలాడదీసి మరీ భక్తిని చాటుకున్నారు. మరి అభిమాన హీరోలపై ఇలా తమ భక్తిని ప్రదర్శిస్తున్న అభిమానులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. This is next level craze from "Tamil Nadu"#HosurKavadiFestivalPawankalyan pic.twitter.com/Rg1rosHX9O — RS (@Rohit___RS) August 5, 2022 ఇది కూడా చదవండి: Bimbisara Collections: దుమ్ము రేపుతున్న బింబిసారుడు.. మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్! ఇది కూడా చదవండి: Supritha: గ్రాండ్‌గా సుప్రీత బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్!