ఓ సినిమాకు భారీగా కలెక్షన్ రావాలన్నా, థియేటర్ వద్ద సందడి కనిపించాలన్నా సరైన సీజన్ పండుగలే. మిగిలిన రోజులతో పోలిస్తే పండుగ రోజుల్లోనే బాక్సాఫీసులు కళకళలాడుతుంటాయి. అందుకే పండుగకు సినిమాలను సిద్ధం చేసుకునేలా మేకర్స్ ప్రణాళికలు చేసుకుంటారు. ఈ పండుగళ్లో ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాల కిక్కే వేరప్పా. సంక్రాంతి బరిలో సినిమా నిలిస్తే.. విజయం తధ్యమని హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే టాలీవుడ్ బడా హీరోలు తమ సినిమాలను కొత్త ఏడాది తర్వాత వచ్చే పండుగకు సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమౌతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఇద్దరు బడా హీరోలు బరిలోకి దిగారు. ఈ పండుగకు నాలుగు పెద్ద సినిమాలు విడుదల కాగా, రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. నందమూరి వర్సెస్ మెగాస్టార్ మధ్య వార్ గా భావించినప్పటికీ.. ప్రేక్షకులు రెండూ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ రెండు భారీ వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు చూపంతా.. వచ్చే ఏడాది సంక్రాంతి పైనే. ఈ సారి కూడా ఇద్దరు టాప్ హీరోల సినిమాలు రాబోతున్నాయని సమాచారం. అయితే ఈ సారి ఒకే కుటుంబానికి చెందిన హీరోల మధ్య పోటీ జరగనుంది. వాళ్లే బన్నీ, రామ్ చరణ్. మెగా ఫ్యామిలీలోనే వార్ నడవబోతుందని ఇండస్ట్రీ టాక్. వీరిద్దరీ సినిమాలు సంక్రాంతి రేసులో నిలవబోతున్నాయని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయంతో పాటు అంతర్జాతీయ ప్రశంసలు దక్కడంతో ఆ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్ తన తదుపరి సినిమాను శంకర్‌తో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ చేసి చాలా రోజులైనప్పటికీ, కమల్ హాసన్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది. ఈ సమ్మర్‌లో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ తీయబోతున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కనీసం మూడు నెలల పాటు జరుగుతాయి. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజుకు ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ కూడా దీనికి అచ్చొచ్చిన అంశం.
పుష్పతో ఒక్కసారిగా నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 సిద్ధమౌతోంది. నేషనల్ లెవల్‌లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో రెండవ భాగంపై దర్శకుడు సుకుమార్ మరింత శ్రద్ధ కనబరుస్తున్నారట. ఇప్పటికే కథలోనూ పలు మార్పులు చేశారట. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ పార్ట్ ముగిశాక.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగనున్నాయి. వీటన్నింటికి సుమారు ఈ ఏడాది పూర్తవుతుంది. దీంతో ఈ సినిమాకు కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ మైత్రి మూవీస్ భావిస్తోందని సమాచారం. దీంతో మెగా ఫ్యామిలోనే వార్ ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా టెన్షన్ లో ఉన్నారట. బావా, బావామరిది సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ బరి నుండి తప్పుకుంటుందో.. లేక ఈ ఏడాది లాగానే సినిమాలు విడుదలై.. థియేటర్లను షేక్ చేస్తాయో చూడాలి. వచ్చే సంక్రాంతికి మెగా హీరోల సినిమాలు విడుదలవ్వాలని భావిస్తున్నట్లయితే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.