ఓ సినిమాకు భారీగా కలెక్షన్ రావాలన్నా, థియేటర్ వద్ద సందడి కనిపించాలన్నా సరైన సీజన్ పండుగలే. మిగిలిన రోజులతో పోలిస్తే పండుగ రోజుల్లోనే బాక్సాఫీసులు కళకళలాడుతుంటాయి. అందుకే పండుగకు సినిమాలను సిద్ధం చేసుకునేలా మేకర్స్ ప్రణాళికలు చేసుకుంటారు. ఈ పండుగళ్లో ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాల కిక్కే వేరప్పా. సంక్రాంతి బరిలో సినిమా నిలిస్తే.. విజయం తధ్యమని హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే టాలీవుడ్ బడా హీరోలు తమ సినిమాలను కొత్త ఏడాది తర్వాత వచ్చే […]
సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. […]
ఇప్పుడంటే జనరేషన్ మార్పులు వచ్చి అన్నిటిలోనూ సమాన వాటా కావాలని కొంతమంది ఆడవాళ్లు అడుగుతున్నారు గానీ ఒకప్పుడు ఈ వాటాలు, మొహమాటాలు ఎందుకొచ్చిందని మహిళలు పెద్దలు మాటలకు కట్టుబడి ఉండేవారు. అలా ఇప్పటికీ సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి జీవించే వారు ఉన్నారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు. తిప్పాయపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని సంజీవరాయుడుగా కొలుస్తారు. అయితే ఈ ఆలయంలోకి మగవాళ్ళు మాత్రమే […]
పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే అదే పండగ అనుకుని బతుకుతారు రైతులు. అలాంటిది గిట్టుబాటు ధర కంటే ఊహించని ధర వస్తే ఇక ఆ రైతులకు అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది, సంపదలు తెచ్చి పెట్టింది అన్నట్టు.. కొంచెం ఎర్లీగానే మిర్చి రైతులకి సంక్రాంతి పండగ స్టార్ట్ అయ్యింది. మిర్చి పంట వేసిన రైతులకు ఈసారి ఊహించని లాభాలు వచ్చాయి. మిర్చి ధర రైతుల పాలిట బంగారంగా మారింది. […]
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభం కాగానే తెలుగువారిని పలకరించే మొదటి పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను తెలుగువారు.. ఎంతో ప్రత్యేక, భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజున కనుమ జరుపుకుంటారు. మూడు రోజుల పాటు.. ఇంటినిండా బంధువులతో.. ఇళ్ల ముందు ముత్యాల రంగ వల్లులతో.. ప్రతి లోగిలి కలకల్లాడుతూ ఉంటుంది. ఇక భారతీయ సంప్రదాయంలో.. పశుపక్ష్యాదులకు కూడా ఎంతో ప్రాధాన్యం […]
సినిమా ఇండస్ట్రీలో స్టార్ వార్ అన్నది సర్వ సాధారణం. ఇద్దరు హీరోలు నేరుగా గొడవ పడకపోయినా.. వారి సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పండగల సందర్భంలో. తెలుగు నాట సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల చేయటం ఎన్నో ఏళ్లనుంచి వస్తోంది. ఇలా ఇండస్ట్రీలో సంక్రాంతికి తమ సినిమాలు విడుదల చేసి పోటీ పడ్డ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి- నందమూరి నటసింహం బాలకృష్ణల ద్వయం ఒకటి. వీరిద్దరూ దాదాపు 30 ఏళ్లుగా చాలా […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి గట్టి షాక్ తగిలింది! గతంలో ఆయనే చెప్పిన ఓ విషయం ఇప్పుడే ఏకంగా ఆయనకే రివర్స్ లో కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ దిల్ రాజుకి జరిగిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఆయన గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్న ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు […]
సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని ‘ఉత్తరాయణం’ గా చెబుతుంటారు. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు తిరిగి మకరరాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని ‘దక్షిణాయణం’ గా చెబుతుంటారు. ఈ రెండింటిలో దక్షిణాయణం కంటే ఉత్తరాయణం ఎంతో విశిష్టమైనదని అంటారు పెద్దలు. దేవతల దృష్టిలో ఉత్తరాయణ కాలం ‘పగలు’ గా.. దక్షిణాయణ కాలం ‘రాత్రి’ గా కొనసాగుతుంది. ఈ కారణంగానే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని అంటూ వుంటారు. […]
సంక్రాతి సమయంలో ఏపీలో కోడి పందాలకు ఎంత క్రేజ్ ఉందో.. తమిళనాట జల్లికట్టుకు అంతే క్రేజ్ ఉంది. గతంలో సుప్రీం కోర్టు జల్లికట్టు నిర్వహణకు వ్యతిరేంగా తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకు ఈ జల్లికట్టు అంటే ఏంటి.. దాని చరిత్ర ఏంటో తెలియాలంటే.. ఇది చదవాలి. జల్లికట్టు విజేతను పెళ్లాడేవారు ఏటా సంక్రాతి సమయంలో కనుమ నాడు తమిళనాట జల్లికట్టును నిర్వహిస్తారు. క్రీ.పూ. 400-100 ఏళ్ల మధ్య కాలంలోనే జల్లికట్టు నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఈ క్రీడ […]
పండగలకు అందరు ఒక చోటుకు చేరి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. ఇది సామాన్యులకే కాదు మెగాస్టార్ ఇంట్లో ఎప్పుడూ జరిగే విశేషం. ఏదైన సందర్భం వచ్చినప్పుడు మెగా హీరోలంతా చిరంజీవి ఇంట్లో చేరి సందడి చేస్తారు. తాజాగా సంక్రాంతి సందర్బంగా అందరూ ఒక మెగాస్టార్ ఇంటికి వచ్చారు. ఉదయం పూట సరదాగా చిరంజీవి దోశలు వేస్తుంటే మెగా హీరలో.. పంజా వైష్ణవ్ తేజ్, వరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ క్యూ కట్టి మరీ దోశలు తిన్నారు. […]