సీరియల్స్, జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది రీతూ చౌదరి. అయితే తాజాగా రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తండ్రి మరణించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రీతు చౌదరి. ‘‘నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నారు.. నువ్వు లేకుండా జీవించడం చాలా కష్టం.. ప్లీజ్ తిరిగి రా నాన్న’’ అంటూ ఎమోషనల్ పోస్ట్‌లు చేసింది రీతూ. ఇక ఈ విషాద సమయంలో జబర్దస్త్ కమెడీయన్లు, నెటిజనులు, ఆమె ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రీతుకు మద్దతుగా నిలిచారు.
అయితే వారం రోజుల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. రీతు తండ్రి చనిపోయాడంటూ.. ఎమోషనల్ పోస్ట్ చూసి ఆమెను ఓదార్చిన నెటిజనులు.. ఇప్పుడు రీతూ పోస్ట్ చేసిన మరో వీడియో చూసి భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రీతూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేసింది. నల్ల రంగు పల్చటి చీరలో హోయలు పోతూ.. చేసిన రీల్‌ని పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు.. నీ తండ్రి చనిపోయి కనీసం పది రోజులు కూడా కావడం లేదు.. అప్పుడే ఇలాంటి పోస్టింగ్‌లు అవసరమా.. నిన్ననేమో.. నీ జ్ఞాపకాలతో బతికేస్తాను నాన్న అంటూ పోస్ట్ చేశావ్.. ఈ రోజేమో ఎక్స్‌పోజింగ్ వీడియో. అప్పుడే మీ నాన్న చనిపోయిన బాధ నుంచి బయటపడ్డావా.. కనీసం 11వ రోజు వరకు కూడా ఆగలేకపోయావా.. నాన్న చనిపోయిన బాధ కొంచెం కూడా లేదు నీకు.. ఛీ.. అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
కానీ రీతూ ఫ్యాన్స్ మాత్రం ఆమెను సమర్ధిస్తున్నారు. నాన్న చనిపోయిన బాధ నుంచి బయటపడటం కోసమే మళ్లీ తను సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. అయినా ఇది ఇప్పుడు చేసిన వీడియో కాదు.. పాతది.. దాన్ని ఇప్పుడు పోస్ట్ చేసింది. ప్రతి దాన్ని అంత నెగిటివ్‌గా చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన రీతూ.. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా నిర్వహించిన ‘పెళ్లిచూపులు’ అనే ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత గోరింటాకు అనే సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఇక వరుసగా సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి పలు సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం నటిగా, మోడల్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరి రీతూను నెటిజనులు ట్రోల్ చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.