రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే సెలబ్రిటీస్ లో విక్టరీ వెంకటేష్ రీల్ కూతురు ఎస్తేర్ అనిల్ ఒకరు. ఈ యంగ్ బ్యూటీని పేరు చెబితే గుర్తించకపోవచ్చు. బట్.. దృశ్యం సినిమాలో వెంకీకి చిన్న కూతురిగా నటించిన పాప అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎస్తేర్.. ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది.
సెలబ్రిటీలపై ట్రోల్స్ అనేవి చాలా కామన్. ఎన్ని తరాలు మారినా.. ఇండస్ట్రీలో నుండి పాతనీరు పోవడం.. కొత్త నీరు రావడం జరుగుతూనే ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రీలో కొత్త పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెలబ్రిటీల లివింగ్ స్టైల్.. లగ్జరీ లైఫ్ అంటూ వారు సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలా రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే సెలబ్రిటీస్ లో విక్టరీ వెంకటేష్ రీల్ కూతురు ఎస్తేర్ అనిల్ ఒకరు. ఈ యంగ్ బ్యూటీని పేరు చెబితే గుర్తించకపోవచ్చు. బట్.. దృశ్యం సినిమాలో వెంకీకి చిన్న కూతురిగా నటించిన పాప అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఎస్తేర్.. దృశ్యంలో పాపే.. కానీ, ఇప్పుడు మాత్రం పాప కాదు. పెరిగి హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. అవును.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతోంది. ఎస్తేర్ గురించి సినిమా వాళ్ళకి తెలిసినంత సోషల్ మీడియా జనాలకు తెలియకపోవచ్చు. అయితే.. ఎస్తేర్ తో నెటిజన్స్ కి ఉన్న పరిచయం వేరు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎస్తేర్.. ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా దృశ్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత జోహార్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేసింది.
ఇదిలా ఉండగా.. తాజాగా టాటూతో వార్తల్లో నిలిచిన ఎస్తేర్. నడుముకి వెనక భాగంలో ఈ 21 ఏళ్ళ భామ.. ‘గ్రోయింగ్’ అని టాటూ వేయించుకున్న వీడియో కూడా షేర్ చేసింది. దీంతో ఇప్పుడు అమ్మడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ నెటిజన్స్ ఆమె టాటూపై ట్రోల్ చేస్తున్నారు. కానీ.. ఎస్తేర్ కి ట్రోల్స్ ఏం కొత్తకాదు. ఆల్రెడీ ఇన్ స్టాగ్రామ్ లో ఓవైపు ఎద అందాలు షో చేస్తూనే.. అప్పుడప్పుడు మరింత ఘాటుగా ఫ్యాన్స్ ని కవ్విస్తోంది. ప్రెజెంట్ ఈ భామ ఓవైపు స్టడీస్ కొనసాగిస్తూనే, హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరి దృశ్యం, దృశ్యం 2, జోహార్ సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. త్వరలోనే కొత్త సినిమాతో సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. మరి ఎస్తేర్ అనిల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియ జేయండి.