నారప్ప.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా.., కరోనా నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే.., నారప్ప చిన్న కొడుకుగా సిన్నప్పగా నటించిన కుర్రాడికి మాత్రం ఇంకాస్త ఎక్కువ పేరు వచ్చింది. దీంతో.., అసలు ఎవరీ సిన్నప్ప అని అంతా ఈ కుర్రాడి గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
నారప్ప సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన సిన్నప్ప అసలు పేరు గీతాకృష్ణ. కానీ.., అంతా ఇతన్ని రాకీ అని ముద్దుగా పిలుస్తుంటారు. రాజమండ్రికి చెందిన రాకీకి కూడా సినిమా నేపధ్యం ఉంది. ఇతని అన్నయ్య చాలా ఏళ్లుగా కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు.
స్వతహగా నటన అంటే ఇష్టపడే రాకీ.. తన అన్నయ్య ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చాడట. అయితే.., కెరీర్ తొలినాళ్లలో చేసిన చాలా క్యారెక్టర్స్ ఎడిటింగ్ లో పోయాయట. ఇక రంగస్థలం సినిమాలో గోడకి పోస్టర్స్ అంటించే సన్నివేశంలో ఉంది కూడా రాకీనే అట.
సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు రాకీ. అయితే.., నారప్ప మూవీ ఆడిషన్ కి కూడా తనకి ఇష్టం లేకుండానే అన్నయ్య బలవంతం మీద వెళ్లాలనని, కానీ.., అనుకోకుండా ఆ అవకాశం తనకే వచ్చిందని చెప్పుకొచ్చాడు రాఖీ. సుమన్ టీవీకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలోనే రాకీ..
నారప్ప షూట్ సమయంలో వెంకటేశ్ తో గడిపిన మధుర క్షణాల గురించి పంచుకున్నాడు. షూట్ సమయంలో తనకి వెంకటేశ్ గారు చాలా ప్రోత్సాహం ఇచ్చారని, ఆయన చాలా గొప్ప వ్యక్తని రాకీ.. మన వెంకీ మామపై పొగడ్తల వర్షం కురిపించేశాడు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్ట్ లో ఉంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేసేయండి.