ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది రానా నాయుడు అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి బూతు సిరీస్ గా ముద్ర వేయించుకుంది. పరిమితికి మించి బూతులు ఉండటం.. సె*క్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో తాజాగా నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా సమయం నుంచి ఓటీటీల వాడకం పెరిగింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. అదీకాక ఈ ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో.. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ జనాల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఛానల్ అయిన నెట్ ఫ్లిక్స్ లో తాజాగా స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ రానా నాయుడు. విక్టరీ వెంకటేష్, రానా లు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి బూతు సిరీస్ గా ముద్ర వేయించుకుంది. పరిమితికి మించి బూతులు ఉండటం.. సె*క్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో.. వెంకటేష్, రానాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక బూతుల ఎఫెక్ట్ పడటంతో.. నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
రానా నాయుడు.. ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్.. వ్యూవర్ షిప్ పరంగా అద్భుతంగా రెస్పాన్స్ సంపాదించిది. రానా నాయుడు వెబ్ సిరీస్ తో వెంకటేష్ తో సహా రానా తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అరంగేట్రం చేశారు. ఇక ఈ సిరీస్ ఉన్న అడల్ట్ కంటెంట్ కారణంగా విపరీతమైన క్రేజ్ తో పాటు.. విమర్శలను కూడా ముట కట్టుకుంది. ఇక ఈ సిరీలో సెన్సార్ కు మించి బూతులు, సెక్స్ సీన్స్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు రానా నాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండగా.. తాజాగా తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం బూతులు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు తెలుగు ఆడియోను తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shocker: Rana Naidu’s Telugu audio removed from Netflixhttps://t.co/LR9byhWebd#123telugu #RanaNaidu #VenkateshDaggubati #RanaDaggubati #Netflix
— 123telugu (@123telugu) March 29, 2023