దగ్గుబాటి వంశం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో కన్నా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడని భావించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే..
మిగతా రంగాలతో పోలిస్తే.. సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలు.. ఈ రెండింటిలో.. వారసుల ఎంట్రీ ఇవ్వడం.. రాణించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇలా ఎంట్రీ ఇచ్చిన వారసులు తమకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోకపోతే.. వారు ఆయా రంగాల్లో రాణించడం కష్టం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూశాం. సినిమాలు, రాజీకయాల్లోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న వారు ఎందరో ఉన్నారు. వారసుల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఆయ రంగాల్లో రాణిస్తారు. మిగతావారు.. కొన్నాళ్ల పాటు సక్సెస్ కోసం ప్రయత్నించి.. ఆ తర్వాత తప్పుకుంటారు. అలా దగ్గుబాటి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యాడు ఓ నటుడు. మరి ప్రస్తుతం అతడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఉన్నాడు వంటి వివరాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. ఆయన కుమారులు ఇద్దరూ కూడా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. సురేష్ తండ్రి బాటలోనే నిర్మాతగా రాణిస్తుండగా.. వెంకటేష్.. తెలుగులో ప్రధాన హీరోల్లో ఒకరుగా ఎదిగారు. ఇక ప్రసుత్తం ఈ ఇంటి నుంచి మూడో తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సురేష్ బాబు కొడుకు రానా హీరోగా, విలన్‌గా, కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రానా సోదరుడు అభిరామ్ కూడా అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి టాలీవుడ్‌లో ఉన్నవారు అనగానే మనకు ఈ నలుగురే గుర్తుకు వస్తారు. కానీ దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా వచ్చిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని మీకు తెలుసా. దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన ఆ వ్యక్తి.. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కనుమరుగయ్యాడు. మరి ఇంతకు ఆ నటుడు ఎవరు అంటే.. దగ్గుబాటి రాజా. ఆయన పూర్తి వివరాలు..
దగ్గుబాటి రాజా.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1981లో తమిళ చిత్రం పాక్కు వెతలై ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈయనకు దగ్గుబాటి కుటుంబంతో ఏదైనా రిలేషన్ ఉందా అంటే ఉంది.. మూవీ మొఘల్ రామానాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా. దర్శకుడు భారతీ రాజా దగ్గర నటనలో శిక్షణ పొందాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడగానే ఆకట్టుకునే రూపం, దగ్గుబాటి వారసత్వం.. దాంతో ఇంకేముంది.. స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. ఇక తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వనిత, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఒకప్పుడు సౌత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాజా ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరమయ్యాడు. ఒకానొక దశలో ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు రాలేదు. బాబయ్ రామానాయుడి దగ్గరకు వెళ్లి ఉంటే పరిస్థితి మరోల ఉండేదేమో. కానీ ఆయన అలాంటి ప్రయత్నాలు చేయలేదు. సినిమా అవకాశాలు తగ్గడంతో.. చెన్నై వెళ్లారు. అక్కడ తన తండ్రి దగ్గరకు వెళ్లి.. ఆయన నిర్వహిస్తోన్న గ్రానైట్ వ్యాపారం బాగోగులు చూసుకోసాగాడు. ప్రస్తుతం భార్యాబిడ్డలతో కలిసి.. చెన్నైలోనే నివాసం ఉంటున్నాడు.
ఇక రాజా చివరిసారిగా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో కనిపించాడు. రాజాకు ఒక కుమార్తె, కొడుకు సంతానం ఉననారు. ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న వీరు.. దగ్గుబాటి వారింట జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటారు. అయితే రాజాకున్న మొహమాటం వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అంటారు అభిమానులు. ప్రసుత్తం వ్యాపారంలో రాణిస్తూ.. కోట్లు ఆర్జిస్తున్నారు రాజా.