దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు హీరోవెంకటేష్ బాబాయి, లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు.
దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు హీరోవెంకటేష్ బాబాయి, లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసిన వెంటనే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో అభిరామ్ కారంచేడు వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో అతడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ కారంచేడు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దగ్గుబాటి కుటుంబసభ్యులు ఎక్కువుగా నగరాల్లో స్థిరపడటంతో దగ్గుబాటి మోహన్ బాబు కుటుంబం ఒక్కటే సొంత ఊరు కారంచేడులో ఉంటూ కుటుంబ బాగోగులు.. వ్యవసాయాన్ని చూసుకుంటున్నట్లు సమాచారం. ఇంటి పెద్ద దిక్కుగా ఉంటూ అన్ని బాగోగులు చూసుకునే మోహన్ బాబు మరణంతో దగ్గుబాటి వారింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.