ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇదిలా ఉండగా..ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. వెంకటేష్ ఇలాంటి సినిమా తీసాడంటే ఎవరు ఊహించి ఉండరు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ స్పందించాడు.
టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా విక్టరీ వెంకటేష్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ సీనియర్ హీరో సినిమాలో కుటుంబం, విలువలు లాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. గతంలో వెంకీ తీసిన కలిసుందాం రా సినిమా కుటుంబ నేపథ్యంలో వచ్చి .. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక అప్పటినుంచి వెంకటేష్ మీద ఫ్యామిలీ హీరో ముద్ర పడింది. దానికి తగ్గట్లుగానే వెంకటేష్ కూడా ఈ తరహాలో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇదిలా ఉండగా.. ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. వెంకటేష్ ఇలాంటి సినిమా తీసాడంటే ఎవరు ఊహించి ఉండరు. అయితే తాజాగా ఈ సినిమా గురించి వెంకటేష్ స్పందించాడు.
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సినిమాలో రానా మరొక హీరో. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న వెంకటేష్ తన ఇమేజ్ కి భిన్నంగా ఈ వెబ్ సిరీస్ లో నటించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ అంతా డబల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ తో నిండిపోయాయి. దీంతో వెంకటేష్ పాత్రపై కొంతమంది ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ సిరీస్ బాగానే ఆడినప్పటికీ.. అందరికీ కనెక్ట్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. ఈ సినిమా ప్రెస్ మీట్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ లో అభ్యంతరకర సన్నివేశాల గురించి ప్రశ్నించారు. ఈ విషయంపై వెంకటేష్ మాట్లాడాడు.
“రానానాయుడు సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే బోల్డ్ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది. ఫస్ట్ సీజన్ లో కొన్ని సీన్స్ ప్రభావం చూపిన మాట వాస్తవమే. నెక్స్ట్ సీజన్ మాత్రం అందరికి నచ్చే విధంగానే ఉంటుంది మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఆడియన్స్ పెరుగుతారు అని అన్నారు”. అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. మరి వెంకటేష్ చెప్పినట్లుగా సెకండ్ సీజన్ అందరినీ మెప్పించేలా ఉంటుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.