విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రానికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
విక్టరీ వెంకటేష్ అంటేనే విజయాలకి చిరునామా అని పేరు. అలాగే వెంకటేష్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వెంకటేష్ తన సినీ కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన సైంధవ్” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకటేష్ సినీ కెరియర్ లో నే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా సైంధవ్”రాబోతుంది. ఈరోజు సైంధవ్”మూవీ కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూ సినిమా పై విపరితమైన క్రేజ్ ని పెంచింది.
తన మొదటి సినిమా తోనే డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన శైలేష్ కొలను దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ హీరో గా బాలీవుడ్ అగ్రనటుడు నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో రుహాణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్ లు హీరోయిన్లుగా సైంధవ్”మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన తమిళ నటి ఆండ్రియా జెరెమియా కూడా ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇంక అసలు విషయానికి వస్తే ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైంధవ్” మేకర్స్ తమ సినిమా కి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసారు. ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ తో పాటు పైన చెప్పకున్న మిగతా నటీనటులు అండ్ జయప్రకాశ్, బేబీ సారా కూడా కనిపిస్తున్నారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ యా నటుల విభిన్నమైన లుక్స్ తో వీడియో ఒక రేంజ్ లో ఉంది. ఈ వీడియో చూసిన విక్టరీ వెంకటేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అలాగే వీడియో సైంధవ్” సినిమా మీద సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాల్ని పెంచేలా చేసింది.