తెలుగు థియేటర్లలో మరో మాస్ సినిమా జాతర చేసేందుకు రెడీ అయిపోయిందనిపిస్తోంది. తాజాగా 'దసరా' ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.
టాలీవుడ్ లో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు డార్క్ థీమ్ మాస్ ట్రెండ్ నడుస్తోంది. ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లాంటి ఊరమాస్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ సక్సెస్ కావడంతో మిగతా హీరోలు, దర్శకనిర్మాతలు ఆ తరహా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అలా తీసిన సినిమానే ‘దసరా’. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పూర్తిగా గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో తీశారు. పోస్టర్స్ తోనే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్ల కంటే ఊరమాస్ గా ఉంటూ మూవీపై అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది.
ఇక విషయానికొస్తే.. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం గోదావరిఖని బొగ్గు గనుల్లో అల్లరి చిల్లగా తిరిగే ధరణి ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. అతడికి వెన్నెల అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ సమస్యలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత పరిస్థితులు ఏవైపు దారి తీశాయి? చివరకు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో ‘దసరా’ తీసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో అయితే దాదాపు ఇదే విషయాన్ని చూపించారు. ముందు నుంచే చెబుతున్నప్పుడు పూర్తి మాస్ మాసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.
ఇక నాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ లో ఎక్కువగా కనిపించిన నాని.. ఫర్ ది ఫస్ట్ టైం ‘దసరా’ కోసం ఊరమాస్ గా మారిపోయాడు. ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా హీరో అని ఎక్కడా అనిపించలేదు. బొగ్గు గనుల్లో తిరిగే తెలంగాణ పోరగాడే గుర్తొస్తాడు. అంత మాస్ గా ఉన్నాడు మరి. అయితే ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త మిక్స్ డ్ అనిపించినప్పటికీ.. సినిమా మాత్రం వేరే లెవల్లో ఉండబోతుందని తెలుస్తోంది. ’10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క చావు చచ్చాడు. పురాణాలను మించిన బతుకులా మనవి?’ అనే డైలాగ్ అయితే వావ్ అనిపించింది. మార్చి 30న పాన్ ఇండియా రేంజులో ‘దసరా’ రిలీజ్ కానుంది. మరి ‘దసరా’ ట్రైలర్ చూడగానే మీకెం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.