టాలీవుడ్‌లో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఒక్క హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అవుతున్న సమయంలో పది మంది హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో లక్ ఎవరినీ వరిస్తుందో వాళ్లే టాప్ హీరోయిన్లుగా రాణిస్తారు. కొన్నేళ్ల పాటు హవా కొనసాగిస్తూనే ఉంటారు
టాలీవుడ్‌లో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఒక్క హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అవుతున్న సమయంలో పది మంది హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో లక్ ఎవరినీ వరిస్తుందో వాళ్లే టాప్ హీరోయిన్లుగా రాణిస్తారు. కొన్నేళ్ల పాటు హవా కొనసాగిస్తూనే ఉంటారు. వీరి ఇమేజ్ ఇంటికి చేరుకుంటుందనుకున్న సమయంలో టాలీవుడ్ మరో భామకు హైప్ ఇస్తుంది. సినిమా పరిశ్రమ మొదలైన 8 దశాబ్దాల్లో ఇదే జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. బయట నుండి వస్తున్న అందగత్తెలతో పాటు ఇంట్లోనే(పరిశ్రమలోని) ఆ వాతావరణంలో పెరుగుతున్న బ్యూటిఫుల్ గర్ల్స్ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఆ కోవకు చెందిన వారే. ఈ ఫోటోలో చారడేసి కళ్లతో పాటు బూర బుగ్గలతో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులను గుర్తుపట్టారా. ఈ ఇద్దరూ టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. నాలుక మడత పెడుతూ..ఎవరినే ఎక్కిరిస్తూ కనిపిస్తున్న చారడేసి కళ్లున్న అమ్మాయి అయితే సౌత్ మొత్తానికి టాప్ స్టార్. ఇక రెండు పిలకలు వేసుకని క్యూట్ స్మైల్‌తో కనిపిస్తున్న ఈ బుగ్గల బూరీ.. ఇప్పుడిప్పుడే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వాలని కుతుహలం పడుతుంది. ఈ ఇద్దరు ఫిల్మీ గ్రౌండ్ ఉన్న చిన్నారులే. ఇంతకు వీరెవ్వరో కాదూ జాతీయ ఉత్తమ నటి, మన మహా నటి కీర్తి సురేష్, ఆ రెండు జళ్ల సీత.. కళ్యాణి ప్రియదర్శినీ.
కీర్తి సురేష్ తల్లి మేనకా.. చిరంజీవితో తెలుగులో నటించిన సంగతి విదితమే. అలాగే కళ్యాణి తండ్రి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాగా, తల్లి లిజీ కూడా నటే. ఆమె తెలుగులో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. వీళిద్దరూ మలయాళ ముద్దుగుమ్మలే. ఇరు కుటుంబాలకు చిన్నప్పటి నుండి సాన్నిహిత్యం ఉంది. ఈ ఫోటోను గతంలో కళ్యాణి ప్రియదర్శన్ షేర్ చేసింది. కళ్యాణి హలో అనే తెలుగు సినిమాతోనే సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఇప్పుడు మలయాళ సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక కీర్తి సురేష్ ఈ ఏడాది దసరాతో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మామన్నన్ తో తమిళ్ పెద్ద హిట్ కొట్టింది. చిరంజీవితో కలిసి బోళా శంకర్‌లో కనిపిస్తుంది. ఇద్దరూ దక్షిణాది సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.