తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పాత్రకు బ్రహ్మానందం వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాల్లో కనిపించని వడివేలు ఇటీవల ఓ చిత్రంతో సంచలనం సృష్టించారు.
సినిమా నటులు చాలా మంది ఛాలెంజింగ్ రోల్స్‌లో కనిపించి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా ఒక్క క్యారెక్టర్లో అద్భుతంగా నటించి యాక్టర్‌గా స్థిరపడిన వాళ్లూ ఉన్నారు. ఇక కమెడియన్స్ విషయానికొస్తే.. నవ్వించడం చాలా కష్టం అని ఇతర నటీనటులు చెప్తుంటారు. తెలుగులో బ్రహ్మానందం చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ లో సీరియస్ రోల్ చేసి అలరించారు. ఆయనలానే తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పాత్రకు బ్రహ్మానందం వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాల్లో కనిపించని వడివేలు ఇటీవల ఓ చిత్రంతో సంచలనం సృష్టించారు. అదే ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరో, కీర్తి సురేష్ హీరోయిన్. ఫాహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్లో కనిపించాడు.
‘పరియేరుమ్ పెరుమాళ్’ (Pariyerum Perumal), ‘కర్ణన్’ (Karnan) సినిమాలతో ఆకట్టుకున్న మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. అతని గత చిత్రాల్లానే ఇందులోనూ పేద, ధనిక వర్గాల నేపథ్యం ఉంటుంది. జూన్ 29న తమిళనాట విడుదలైన ‘మామన్నన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడికి మినీ కూపర్ కారుని బహుమతిగా ఇచ్చాడు ఉదయనిధి స్టాలిన్. సినిమా చూసిన వారంతా వడివేలులో ఇంత మంచి నటుడు ఉన్నాడా! అంటూ ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడి ఆయన పాత్రను తీర్చి దిద్దిన విధానం, ‘మామన్నన్’ గా వడివేలు అసాధారణ నటనకు అంతా ఫిదా అవుతున్నారు
కథ ఏంటంటే..
మామన్నన్ (వడివేలు) కాశీపురం అనే ఊరికి ఎమ్మెల్యే. కొడుకు ఆది వీరన్ అలియాస్ వీర (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు గల వ్యక్తి. లీల (కీర్తి సురేష్) పేద విద్యార్థుల కోసం ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ లీడర్ అయిన రత్నవేలు (ఫాహద్ ఫాజిల్) వల్ల లీలకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆమెకు మామన్నన్, ఆది వీరన్ అండగా ఉంటారు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి రత్నవేలుని ఎలా అడ్డుకున్నారు అనేది మిగతా కథ.
డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ చిత్రంలో పేద, ధనిక వర్గాల పాయింట్‌తో పాటు పొలిటికల్ టచ్ ఇచ్చాడు. ఎ.ఆర్.రెహమాన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఇక మూవీ చూసిన వారంతా ‘మామన్నన్’ లాంటి సీరియస్ క్యారెక్టర్లో వడివేలు అద్భుతంగా నటించారంటూ ప్రశంసిస్తున్నారు. ఆయన కోసమే థియేటర్లకు వెళ్తున్నారు. ప్రముఖ మలయాళీ నటి మాల పార్వతి, వడివేలు నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పారు.
Thx #Maamannan team @mari_selvaraj @KeerthyOfficial @arrahman sir #fafa #Vadivelu annan @RedGiantMovies_ @SonyMusicSouth #Blockbuster pic.twitter.com/Mmdc9QAyel
— Udhay (@Udhaystalin) July 3, 2023