సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు విషయంలో ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. సినిమాల్లో అవకాశాల పేరుతో చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లు తమను వేదింపులకు గురిచేశారని బహిరంగంగానే చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు విషయంలో ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. సినిమాల్లో అవకాశాల పేరుతో చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లు తమను వేధింపులకు గురిచేశారని బహిరంగంగానే చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ అవకాశాలు వచ్చి నటనారంగంలో స్థిర పడే సమయంలో కొంత మంది చేసే కుట్రల వల్ల అవకాశాలు చేజారి సినీ కెరీర్ చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తమిళ్ చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రముఖ కమెడియన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ నటి ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇటీవల మామన్నన్ సినిమాతో హిట్ కొట్టిన వడివేలు అందరినుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా నటుడు వడివేలుపై షకీలా నిర్వహిస్తున్న ఓ షోలో హాట్ కామెంట్స్ చేసింది. ఆ షోలో పాల్గొన్న నటి కూడా సంచలన ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే .. నటి షకీలా ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది. దీనిలో భాగంగానే తమిళ నటి ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ప్రేమ ప్రియ మాట్లాడుతూ.. నా సినీ జీవితం ప్రారంభమైన మొదట్లో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను.
కానీ ఇండస్ట్రీలో నా ఎదుగుదలను వడివేలు అడ్డుకున్నారు. సినీ అవకాశాలు చాలా వచ్చినప్పటికీ ఆయన వల్ల అవి అర్థాంతరంగా ఆగిపోయాయి. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్తే.. వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని మూవీ మేకర్స్‌తో చెప్పించి పంపించేశారని, ఇలా అనేక సార్లు జరిగిందని ప్రేమ ప్రియ తన ఆవేదనను వెల్లడించింది. దీనిపై షకీలా స్పందిస్తూ వడివేలుపై ఫిర్యాదు చేయొచ్చు గదా అని అడగగా.. దానికి ప్రేమ ప్రియ స్పందిస్తూ మా మధ్యన మీటూ సమస్య లేదని చెప్పింది. ఆ వెంటనే షకీలా కలుగజేసుకుని షూటింగ్ స్పాట్లో వడివేలు ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని తెలిపింది.