నందమూరి బాలకృష్ణ.. ఆ పేరు వినగానే.. తెర మీద ప్రత్యర్థులను వెంటాడే సీన్లు.. తొడగొట్టి చెప్పే మాస్ డైలాగ్‌లే ముందుగా గుర్తుకు వస్తాయి. రీల్ మీద ఇలా ఉంటే.. రియల్‌గా వచ్చేసరికి.. అభిమానుల మీద చిందులు తొక్కిన బాలయ్యగానే ఎక్కువ సందర్భాల్లో కనిపించాడు. కానీ బాలయ్య అంత భోళా మనిషి ఇండస్ట్రీలో ఉండని.. సెట్‌లో తోటి ఆర్టిస్ట్‌లతో ఆయన ఎంతో కలివిడిగా ఉంటారని.. అందరిని ఆటపట్టిస్తూ.. జోక్ చేస్తూ సరదాగా ఉంటారని చాలా మంది చెప్పారు. కానీ వాస్తవంగా బాలయ్యని అంతా సరదాగా చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఇక బాలయ్య అనగానే ముక్కు మీద కోపం, దురుస ప్రవర్తన.. అనుకునేవారే చాలా మంది.
అదిగో బాలయ్య మీద ఉన్నా ఆ నెగిటివ్ ఇమేజ్ మొత్తం ఒక్క షోతో తుడిచిపెట్టుకుపోయింది. అదే అన్‌స్టాపబుల్. ఈ షోతో బాలయ్య అంటే ఏంటో.. ఆయన ఎంత సరదాగా ఉంటారో ప్రేక్షకులుకు స్వయంగా తెలిసింది. విభిన్నమైన తన డైలాగ్ డెలివరి, మ్యానరిజంతో.. ఈ షోని దేశంలోనే టాప్ టాక్ షోగా నిలిపాడు బాలయ్య. ఆయన భాషలో చెప్పాలంటే.. ప్రస్తుతం అనస్టాపబుల్.. అన్ని టాక్ షోలకు అమ్మ మొగుడయ్యింది.
అనస్టాపబుల్ షోతో బాలయ్య సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్నారు. సెలబ్రిటీ గెస్ట్‌లతో ఆయన ముచ్చటించిన తీరు, సరదా సెటైర్లు, పంచ్‌లు, అన్నింటికి మించి బాలయ్య లుక్, స్టైల్, మ్యానరిజం షోకు అతిపెద్ద అట్రాక్షన్‌గా నిలిచాయి. బాలయ్యను సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా నిలిపాయి. అయితే ఈ సక్సెస్‌లో బాలయ్య కుమార్తె కీలక పాత్ర పోషించారు. బాలయ్య హోస్ట్‌గా వచ్చిన ఈ షోని సక్సెస్ చేయడం కోసం రెండో కుమార్తె తేజశ్వి కీలక పాత్ర పోషించారు. అయితే ఆమె తెర వెనకే ఉండి.. తండ్రిని విజయవంతమైన హోస్ట్‌గా నిలిపారు.
అన్‌స్టాపబుల్ షో కోసం చాలా మంది పని చేశారు. వారిలో బాలయ్య రెండో కుమార్తె తేజశ్వి కూడా ఉన్నారు. బాలయ్య లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో తేజశ్విని చాలా జాగ్రత్తలు తీసుకునేవారని.. వాటి కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. తొలి సీజన్ భారీ సక్సెస్ సాధించడంలో తేజశ్వినిది కీలక పాత్ర అని సీనియర్ రైటర్ బీవీఎస్ రవి తెలిపారు. ఇక అనస్టాబుల్ తొలి సీజన్ సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత.. రెండో సీజన్ కోసం కూడా తేజశ్విని పని చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రోమోకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రోమోని ఎలా షూట్ చేశారు.. బాలయ్య ఎలా యాక్ట్ చేశారు వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. అయితే దీనిలో బాలయ్యతో పాటు.. తేజశ్విని కూడా ఉన్నారు. దాంతో రెండో సీజన్ కోసం కూడా ఆమె పని చేసినట్లు అర్థం అవుతోంది. ఈ షో కోసం తేజశ్విని క్రియేటివ్ కన్సల్టెంట్‌గా చేసింది. మేకింగ్ వీడియోలో తేజశ్విని చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కోసం చాలా కష్టపడింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనస్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్.. అక్టోబర్ 14న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు రావడంతో.. దీనిపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగాయి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రికార్డు వ్యూస్ కొల్లగొట్టింది.