బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ సీజన్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే నంబర్ 1 టాక్ షోగా నిలిచింది. ఆ ఉత్సాహంతో.. ఆహా టీమ్ అన్‌స్టాపబుల్ సీజన్ 2ని ప్రారంభించనుంది. అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. సీజన్ 1 సక్సెస్‌తో.. సీజన్ 2కి ఎవరూ ఊహించిన వ్యక్తులను గెస్ట్‌లుగా తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ ప్రోమో చూస్తే.. చంద్రబాబును వ్యక్తిగత, రాజకీయ ఇలా అన్ని అంశాల గురించి ప్రశ్నలు అడిగినట్లు అర్థం అవుతోంది. ఇక టాక్ షోలో తెలుగు రాజకీయ చరిత్రలో కీలకంగా నిలిచిన 1995 నాటి సంఘటన గురించి కూడా చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక టాక్ షోలో భాగంగా బాలయ్య చంద్రబాబును ఉద్దేశించి.. రాజకీయాలకు సంబంధించి 1995 నాటి సంఘటన గురించి ప్రశ్నించాడు. మీ జీవితంలో తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంటని ప్రశ్నించగా.. అందుకు చంద్రబాబు.. 1995లో తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు. అంతేకాక ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని చంద్రబాబు.. బాలకృష్ణను ప్రశ్నించాడు. అంతేకాక ఆ రోజు తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు.. ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. కానీ ఆయన ఒప్పుకోలేదు అని తెలిపారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబు నిజంగానే ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బతిమిలాడి.. ఉంటే మరి ఆయన కన్నీళ్లకు కారణం ఏంటి.. ఎవరు.. అని చర్చించుకుంటున్నారు. నిజంగా చంద్రబాబు కాళ్లు పట్టుకుని బతిమిలాడి ఉంటే.. మరి ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే పరిస్థితులు ఎందుకు వచ్చాయి.. ఆయన మీగురించి చేసిన వ్యాఖ్యలు అబద్ధమా అంటూ అని చర్చించుకుంటున్నారు. మరి కొందరు మాత్రం.. నిజంగానే చంద్రబాబు ఆ నాడు తీసుకున్న నిర్ణయం వల్లే టీడీపీ మనగలిగింది అంటున్నారు. ఏది ఏమైనా అన్‌స్టాపబుల్ కార్యక్రమం ద్వారా మరోసారి నాటి సంఘటన తెర మీదకు వచ్చింది. చర్చనీయాంశంగా మారింది.