చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?
సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది నటీనటుల ఓల్డ్ పిక్స్ నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. వాటిని చూసి సినీ అభిమానులు ఎంతగానో సంతోషిస్తారు.ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న చిరంజీవి,బాలకృష్ణల ఓల్డ్ పిక్స్ చూసిన ఇరువురి అభిమానులు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి మురిసిపోతున్నారు. పైగా బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ కూడా వాళ్ళతో ఉన్నాడు. చిరంజీవి మోక్షజ్ఞ మీద ఆప్యాయంగా చేయి వేయడం చూసి ఇరువురి అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతున్నారు. చిరంజీవి,బాలకృష్ణ ఇద్దరు కూడా తమ అద్భుతమైన నటనతో మూడు దశాబ్దాలపై నుంచే తెలుగు కళామతల్లి ఒడిలో సేద తీరుతూ కొన్ని లక్షల మంది అభిమానుల గుండెల్లో కొలువు తీరి ఉన్నారు. సామాజిక సేవా పరంగా కూడా చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఇద్దరి అభిమానులు కూడా చిరు,బాలయ్యల ఇన్స్పిరేషన్ తో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
తాజాగా వీళ్లిద్దరూ గతంలో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ ఫోటోని చూసిన చిరు బాలయ్య అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. అలాగే సినీ అభిమానులు కూడా చిరు, బాలయ్యల మధ్య సినిమాల విషయంలో ఎంత పోటీ ఉన్నా ఇద్దరు ఎంతో మంచి స్నేహితులని అనుకుంటున్నారు. ఇంక అసలు విషయంలోకి వస్తే నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తాడా అని నందమూరి బాలయ్య అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం మోక్షజ్ఞ ఎప్పడు సినీ రంగ ప్రవేశం చేసినా నందమూరి ఫ్యాన్స్ మద్దతు మోక్షజ్ఞ కి ఎలాగూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్ తో మోక్షజ్ఞకి చిరంజీవి సపోర్ట్ కూడా ఉంటుందని అందరికీ అర్ధం అయ్యింది. మెగాస్టార్ సపోర్ట్ ఇస్తున్నాడంటే మెగా ఫాన్స్ సపోర్ట్ కూడా మోక్షజ్ఞకి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.