నందమూరి బాలకృష్ణ.. తెరపై ఎంత ఉగ్రరూపంతో కనిపిస్తారో.. బయట అంత జోవియల్ గా ఉంటారు. నవ్వుతూ.. నవ్విస్తూ సరదాగా ఉంటారు. ఇక బాలయ్య హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ టాక్ షో టెలివిజన్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. దాంతో అన్ స్టాపబుల్-2 కు ప్లాన్ చేశారు మేకర్స్. దానిలో భాగంగానే ఇటీవల మేకింగ్ వీడియోను సైతం విడుదల చేశారు. తాజాగా ఈ షోకు సంబంధించిన తొలి ఎపీసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఎపిపోడ్ కు చంద్రబాబు, లోకేష్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ నుంచి చంద్రబాబుకు ఓ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అన్ స్టాపబుల్-2.. షూటింగ్ ఎప్పుడు మెుదలైందో అప్పటి నుంచి ఈ షోపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మెుదటి సీజన్ భారీ విజయం సాధించడంతో పాటు.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు బాలకృష్ణ బావ నారా చంద్రబాబు, బాలయ్య అల్లుడు లోకేష్ వస్తున్నారు.. అని తెలియడంతో మరింతగా ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. వారందరు ఎదురు చూసినట్లుగానే తాజాగా ప్రోమో రానే వచ్చింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ నుంచి చంద్రబాబుకు ఓ ప్రశ్న ఎదురైంది. బాలయ్య.. మీ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఏంటి? అని ప్రశ్నించగా.. చంద్రబాబు మెుహంలో ఒక్కసారిగా భావోద్వేగం కనిపించింది. చంద్రబాబు మాట్లాడుతూ..” నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం 1995 నాటి ఘటన. ఆ రోజు ఏ పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చిందో.. మీ అందరికి తెలుసు. నువ్వు చెప్పు ఆ రోజు మనం చేసింది తప్పా? ఆయన్ని కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. కానీ పెద్దాయన మన మాట వినలేదని” చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
1995 నాటి తెలుగు రాష్ట్ర రాజకీయ పరిస్థితి అందరికి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీ పగ్గాలు దక్కించుకోవడం.. దానికి నందమూరి కుటుంబ సభ్యుల మద్ధతు లభించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నాటికీ కూడా చంద్రబాబు పై ఆ మచ్చ అలానే ఉండిపోయింది. అయితే ఈ షో ద్వారా.. చంద్రబాబు ఆ నాటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసినట్టు ఈ ప్రోమో లో అర్థం అవుతోంది. మరి.. పూర్తి ఎపిసోడ్ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ ఎపిసోడ్ లో రాజకీయ విషయాలే కాక మరి కొన్ని విషయాలపై కూడా ప్రశ్నలు సంధించారు బాలయ్య. బాలయ్య అల్లుడు నారా లోకేష్ సరదాగా కొద్దిసేపు హోస్ట్ గా మారి బాలయ్యను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.