అన్‌స్టాపబుల్.. దేశవ్యాప్తంగా ఈ టాక్ షో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. టీఆర్పీ లెక్కల విషయానిగి వస్తే దేశంలోనే నంబర్ వన్ షోగా చరిత్ర సృష్టించింది. దేశం మొత్తం ఈ షో గురించే మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు అన్‌స్టాపబుల్-2 అంటూ నందమూరి నటసింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అన్ స్టాపబుల్-2 టాక్ షో గురించే చర్చ నడుస్తోంది. ఒక్క ప్రేక్షకుల్లోనే కాదు.. అటు రాజకీయ వర్గాల్లోనూ ఈ సీజన్ గురించి టాక్ నడుస్తోంది. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే ఈసారి సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చింది. నారా చంద్రబాబు– నారా లోకేష్ కాబట్టి. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు.
అందరూ ఇప్పటివరకు నారా చంద్రబాబుని ఎంతో సీరియస్‌గా చూసుంటారు. రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండటం చూసుంటారు. కానీ, ఈ ఎపిసోడ్ ద్వారా ఆయనలో ఉన్న చిలిపి, అల్లరితనాన్ని కూడా చూసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమైనా చిలిపి పనులు చేశారా? అని బాలయ్య అడగ్గా.. మీకన్నా ఎక్కువే చేశాం అంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు. మీరు సినిమాల్లో చేశారు. మేము కాలేజీలో చేశాం అంటూ చంద్రబాబు ఎంతో హుషారుగా చెప్పారు. అంతేకాకుండా అమ్మాయిలను చూస్తే సైలెన్స్ లు తీసేసి గోల చేసేవాళ్లమంటూ అలనాటి రోజుల గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బావా అని అడగ్గా.. చంద్రబాబు వెంటనే రాజశేఖర్‌రెడ్డి నేను బాగా కలిసి తిరిగేవాళ్లం అంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు. ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రశ్నలు, అదే స్థాయిలో సమాధానాలు చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14న ఆహాలో స్ట్రీమ్ కానున్నట్లు తెలిపారు.