ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు అందించారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన జగన్.. కేవలం మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కూడా అమలు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో ఏ రాష్ట్రంలో లేనంత బాగా అమలు చేస్తున్నారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. విద్య ఎంత ముఖ్యమో, వైద్యం కూడా అంతే ముఖ్యం అని నమ్మిన జగన్.. అందుకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా మెడికల్ రీయంబర్స్మెంట్ స్కీంను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంప్లాయ్ హెల్త్ స్కీంతో (ఈహెచ్ఎస్) ఇబ్బందులు పడుతున్నామని, కావున మెడికల్ రీయంబర్స్ మెంట్ ను పొడిగించాలని ఉద్యోగులు కోరగా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీఐఎంఏ నిబంధనలు 1972 కింద హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెడికల్ రీయంబర్స్ మెంట్ స్కీంను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కోరిక మేరకు.. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 2023 మార్చి 31 వరకూ మెడికల్ రీయంబర్స్ మెంట్ స్కీంను పొడిగిస్తూ జీవో 776 జారీ చేసింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంతో సంబంధం లేకుండా ఈ స్కీం కూడా అమలు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం 01-08-2022 నుంచి 31-03-2023 వరకు గడువు పొడగిస్తూ ఉత్తర్వులు
AP Medical Reimbursement Scheme Extended upto 31.03.2023 https://t.co/AV6Nib2WOM. 776 Dated: 11-10-2022 pic.twitter.com/R2jWnwKVci
— sivakumar (@sivattd) October 11, 2022