హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి. అండర్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది,సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన కాజల్,శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా భగవంత్ కేసరి మూవీకి డ్యామేజ్ కలిగేలా మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు రావడం.వెంటనే ఆ వార్త నిజం కాదని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమా భగవంత్ కేసరి. కొన్ని రోజుల క్రితం మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ని రిలీజ్ చేస్తే ఆ టీజర్ లో ఉన్న బాలకృష్ణ వేషధారణ అండ్ బాలకృష్ణ పలికిన డైలాగ్స్ విపరీతమైన సంచలనం సృష్టించి సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగేలా చేసింది. కాని ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో వచ్చిన ఒక మూవీ స్టోరీ అనే వార్త ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
దివంగత నందమూరి హరికృష్ణ హీరోగా అందాల నటి మీనా హీరోయిన్ గా 2004 లో స్వామి అనే సినిమా వచ్చింది. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా నువ్వు వస్తావని లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన దివంగత దర్శకుడు విఆర్ ప్రతాప్..స్వామి మూవీ కి దర్శకత్వం వహించడం జరిగింది. సిస్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన స్వామి మూవీ లో తన చెళ్ళల్ల జీవితాన్నీనాశనం చేసి వాళ్ళని అత్యంత దారుణంగా చంపిన వాళ్ళని చంపే పాత్రలో హరికృష్ణ సూపర్ గా నటించారు.ఇప్పుడు ఈ స్వామి సినిమా కథనే కొంచెం అటు ఇటుగా చేసి భగవంత్ కేసరి మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
భగవంత్ కేసరి కథకి సంబంధించి బయటకు వస్తున్న రూమర్ మీద నిజం తెలుసుకోవటానికి ఒక నెటిజన్ చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చెయ్యగా వెంటనే స్పందించిన చిత్ర బృందం సదరు నెటిజెన్ తో భగవంత్ కేసరి కథ విషయంలో బయట వినపడుతున్న రూమర్స్ అన్ని కట్టుకథలని మా మూవీ కథ మాకు తెలుసని మా సినిమా కథతోనే వాళ్ళకి సమాధానం చెప్తామని అన్నారు. దసరా సందర్భంగా రిలీజ్ అయ్యే భగవంత్ కేసరి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు సృష్టించడం కుడా ఖాయం అని మేకర్స్ చెప్తున్నారు.