ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీలతో కూడా సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ఊహించని కామెంట్స్ చేసి అంచనాలు క్రియేట్ చేయాలనీ అనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు నిర్మాతలు దూరంగా ఉండటం మనం చూస్తుంటాం. ఎప్పుడో ఒక సందర్భంలో వారు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం లేదా తమ సినిమాలపై ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ.. ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీలతో కూడా సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇండస్ట్రీలో సినిమాలపై అంచనాలు అనేవి.. సినిమా రిలీజ్ కి రెడీ అయినప్పుడు పెరిగితే సినిమాకి బజ్ బాగా కలిసివచ్చే అవకాశాలు ఉంటాయేమో.. కానీ, ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ఊహించని కామెంట్స్ చేసి అంచనాలు క్రియేట్ చేయాలనీ అనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు.
మీడియా ముందు అప్ కమింగ్ మూవీస్ అప్ డేట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పెంచిన అంచనాలకు ఏమాత్రం తగ్గినా సోషల్ మీడియా ట్రోల్స్ స్ప్రెడ్ అయిపోతాయి. హైప్ పెంచాక ట్రోల్స్ కి దూరంగా ఉండాలని అనుకోవచ్చు. కానీ.. అసలు చిక్కు అప్పుడే మొదలవుతుంది. ఏ టైం ఇచ్చిన స్టేట్ మెంట్స్ కి బాధ్యత వహించాల్సి రావచ్చు. అయితే.. ట్రోల్స్ ని కూడా లైట్ తీసుకొని.. కొంతమంది కాంట్రవర్సీలను ఫేస్ చేస్తుంటారు. అలాంటివారిలో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రెసెంట్ మహేష్ బాబుతో ‘SSMB28’ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై తాజాగా అంచనాలు పెంచుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
రీసెంట్ గా బుట్టబొమ్మ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగవంశీ.. ఇప్పుడు ధనుష్ తో సార్ మూవీని రిలీజ్ కి రెడీ చేశారు. శివరాత్రి సందర్భంగా సార్ మూవీ ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ SSMB28పై కూడా స్పందించారు. SSMB28తో ఫ్యాన్స్ కి ఎలాంటి ఎక్సపీరియెన్స్ ఇవ్వనున్నారు? అని అడగ్గా.. “చెబితే బలుపు అనుకుంటారు. కానీ.. ఈ సినిమాతో రాజమౌళి ఏరియా కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తామని అనుకుంటున్నాం. గతంలో అల వైకుంఠపురంలో మూవీతో కొట్టాం. నెక్స్ట్ రాజమౌళి సినిమా ఏరియా కలెక్షన్స్ ని ఈజీగా అందుకుంటాం” అని అన్నారు. ప్రస్తుతం నాగవంశీ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నిర్మాత వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
Prati Area lo Rajamouli Gari Numbers Degera ki Vellipotam
– Producer Vamsi(1/5) #SSMB28 @urstrulyMahesh pic.twitter.com/4aRZiYK4Qc
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) February 14, 2023