సినిమా పరిశ్రమలో పెళ్లిళ్లు, విడాకులు.. డేటింగ్ లు, బ్రేకప్.. లు సర్వసాధారణం. గతంలో అభిప్రాయ భేదాలతో విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఈక్రమంలో ఓ టాలీవుడ్ జంట విడిపోయి 10 నెలలు అవుతున్నప్పటికీ ఆ జంట గురించిన వార్తలు ఇంకా వినిపిస్తునే ఉన్నాయి. ఈపాటికే మీకు అర్థం అయిందనుకుంట ఆ జంట ఎవరో! అవును ఆ జోడి నాగచైతన్య-సమంత.. వీరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య సమంత పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మొదట్లో విడాకులపై అసలు నోరు విప్పని నాగచైతన్య ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ప్రమోషన్స్‌లో పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన నాగచైతన్యకు సమంత గురించి ఓ ప్రశ్న ఎదురైంది. విడాకుల గురించి కాకుండ కొత్తగా సమంతపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా. దీనికి చై స్పందిస్తూ.. ‘సమంత అంటే ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే మెుదట్లో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నిర్వచించడం నేర్చుకున్నారా? అని అడగ్గా.. చై స్పందిస్తూ.. ‘అదే చేస్తున్నాను కాబట్టే ప్రస్తుతం ఇలా ఉన్నానన్నాడు. ‘వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య ఒక స్పష్టమైన రేఖను గీయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. రెండు కలిపి చూడోద్దు. చిత్తశుద్దితో చేసే పని మనల్ని ఎప్పుడు గెలిపిస్తుంది. వార్తలకు వార్తలే సమాధానం ఇస్తాయి. ఇవాళ ఒకటి వస్తే రేపు మరొకటి. కాబట్టి వాటిని పట్టించుకోకుండ మనం ఏం చేయాలనుకుంటున్నామో దానిపైనే దృష్టి పెట్టాలి’ అంటూ నాగచైతన్య వివరించాడు.
ఈ నేపథ్యంలో నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ ఈ మూవీలో హీరోగ నటిస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వలో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ‘ధూత’ అనే వెబ్ సిరీస్ లో సైతం నటించాడు. అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నాగచైతన్య సమంత పై చేసిన ఈ తాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.